Gujarat Woman Panipuri Fight: మనదేశంలో పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. పానీ పూరి కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు చాలామంది ఉంటారు. కరకరలాడే పూరిలో.. వేడివేడి బటాని, ఆలూ మిశ్రమంతో తయారుచేసిన కూర.. చింతపండు, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ తో తయారుచేసిన రసాన్ని వేసుకొని తింటూ స్వర్గపు అంచుల్లోకి వెళ్లేవారు చాలామంది ఉంటారు. పానీ పూరి చాలామందికి ఒక ఎమోషన్. అది తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. ఎంత తిన్నా సరే నాలుకకు సంతృప్తి అనేది లభించదు. అందువల్లే పానీ పూరి భారతీయులకు ఒక ఎమోషన్.
Also Read: ‘బ్యూటీ ‘ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా?
కాలం మారుతున్న కొద్దీ పానీ పూరిలో కూడా రకరకాల మార్పులు వచ్చాయి. ఇందులో కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించాయి. అవుట్లెట్లతో సరికొత్త బిజినెస్ చేస్తున్నాయి. పానీపూరి లో రకరకాల వెరైటీలను రూపొందించి సరికొత్తగా వ్యాపారాన్ని చేస్తున్నాయి. పానీ పూరి ని కేవలం యువత మాత్రమే కాదు అన్ని వర్గాల వారు లొట్టలు వేసుకుని తింటుంటారు. ఎంత తిన్నా సరే ఇంకొంచెం కావాలి అన్నట్టుగా బొజ్జలోకి పానీపూరీలను తోసిస్తూ ఉంటారు. పానీపూరిని ఇష్టంగా తినే ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయింది. ఏకంగా గొడవకు కూడా దిగింది. దీనికి సంబంధించిన వివిధ మాధ్యమాల ద్వారా చర్చకు దారితీస్తోంది.
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతానికి చెందిన ఓ మహిళ సాయంత్రం వేళ పానీ పూరి తినడానికి వెళ్ళింది. 20 రూపాయలు చెల్లించి ప్లేట్ ఇవ్వాలని పానీపూరి విక్రయించే వ్యక్తిని అడిగింది. అయితే ఆ వ్యక్తి నాలుగు పూరీలు మాత్రమే ఇచ్చాడు. వాస్తవానికి ఆమెకు గతంలో ఆరు పూరీలు ఇచ్చేవాడు. ఈసారి రెండు తగ్గించడంతో ఆమెకు కోపం వచ్చింది. తనకు మిగతా రెండు పూరీలు కూడా ఇవ్వాలని చిన్న పిల్లలాగా ఏడ్చేసింది. ధరలు పెరిగాయని.. నాలుగు పూరీలకు మించి ఇచ్చే పరిస్థితి లేదని ఆ వ్యక్తి అన్నప్పటికీ ఆ మహిళ ఊరుకోలేదు. అంతేకాదు తనకు ఇవ్వాల్సిన రెండు పూరీలు ఇవ్వకపోతే రోడ్డు దాటి వెళ్ళనని అతడిని హెచ్చరించింది. అంతేకాదు ఆ రెండు పూరీలు ఇవ్వాలని రోడ్డు మధ్యలో కూర్చుంది. దీంతో అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెకు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెండు పానీపూరిల కోసం ఏకంగా పెద్ద యుద్ధమే చేసిన ఆ మహిళ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
In Vadodara, a bizarre incident unfolded when a woman staged a protest on the road after being served only 4 pani puris instead of 6 for 20. Upset, she sat down in protest, causing a traffic jam near Sur Sagar Lake.
When police arrived, she tearfully demanded either two more… pic.twitter.com/gZ2sHq2Xzh
— ACNC Foundation (@AcncFoundation) September 19, 2025