Beauty Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో దర్శకులు సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన చాలా సినిమాలు ఆయా దర్శకులకు మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ‘నిబ్బా – నిబ్బి’ స్టోరీలతో వస్తున్న సినిమాలు సైతం ప్రేక్షకులను అలరిస్తుండటం విశేషం… ఇక ఇప్పటికే ఈ సంవత్సరంలో కోర్టు, లిటిల్ హార్ట్స్ సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయనే విషయం మనకు తెలిసిందే…ఒక అందులో భాగంగానే ఈరోజు ‘బ్యూటీ’ అనే సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా సక్సెస్ ని సాధించిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నిబ్బా (అంకిత్ కొయ్య), నిబ్బి(నిలకి పాత్ర) లు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళ ప్రేమను గొప్పగా చాటుకోవాలని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. మరి ఈ ఇద్దరు వెళ్లిపోవడం పట్ల వల్ల ఇంట్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు. ఇంట్లో వాళ్లకి దొరికిపోయి మన ప్రేమను త్యాగం చేశారా? లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదురించి ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒకటయ్యారా? అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు వర్ధన్ ఈ సినిమాని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేశాడు. ఇందులో ఏమాత్రం చిన్న డిస్టబెన్స్ జరిగిన కూడా స్టోరీ డివియెట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి అలాంటిది ఏమీ లేకుండా దర్శకుడు ఈ సినిమాని చాలా చక్కగా హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఈ డైరెక్టర్ ఇంతకుముందే రాజ్ తరుణ్ తో ‘భలే ఉన్నాడు’ అనే సినిమా అయితే చేశాడు.
ఆ సినిమా ఆశించిన వరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొద్ది రోజులపాటు గ్యాప్ ఇచ్చి ఈ సబ్జెక్ట్ ని రాసుకుని అతను ఏ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఒక వేలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం కొంతవరకు స్లోగా స్టార్ట్ అయినప్పటికి ఒక 20 నిమిషాల తర్వాత సినిమాలో ఫ్లో అయితే వస్తోంది.
అలా ఇంటర్వెల్ వరకు సాగిన సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా అద్భుతంగా పేలింది. ఇక ఆ ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమాని ఇన్వెస్టిగేషన్ రూపంలో ఇంట్రెస్టింగ్ గా మలిచిన విధానం కూడా బాగుంది. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చొబెట్టాయి. మరి ఇలాంటి క్రమంలోనే సినిమాకి మ్యూజిక్ అంత బాగా లేకపోయినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అక్కడక్కడ బాగుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అంకిత్ కొయ్య ఈ సినిమా చాలా మంచి పర్ఫామెన్స్ ను అయితే ఇచ్చాడు. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ లో అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది కండ్లకు కట్టినట్టుగా యాక్టింగ్ చేసి మరి చూపించాడు… నిలాకి పాత్ర హీరోయిన్ పాత్రలో చాలా ఒదిగిపోయి. ఆమె నిబ్బి గా నటించడమే లవ్ స్టోరీ లో నిబ్బీలు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ల అమైండ్ సెట్ ను ఫాలో అవుతూ చాలా క్లారిటీగా చేసి చూపించారు.
మొత్తానికైతే దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద పోట్రే చేసే ప్రయత్నం చేశారు. ఇక సీనియర్ నరేష్ సైతం తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కూతురికి ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చే తండ్రిగా ఆయన హావభావాలు పలికించిన తీరైతే అద్భుతంగా ఉంది. ఇక మిగిలిన పాత్రలను పోషించిన నటులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే మ్యూజిక్ అంత పెద్దగా ప్లస్ అయితే కాలేదు. పాటలు ఏమాత్రం బాగాలేవు. అయినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం కొంతవరకు ఓకే అనిపించారు… ఇక ఈ సినిమాకి శ్రీ సాయి కుమార్ దర అందించిన డీఓపీ వర్కు కూడా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ చాలా బాగా పోట్రే చేసే ప్రయత్నం చేశారు. ఇక ప్రతి క్రాఫ్ట్ లో కూడా వాళ్ళ సత్తా చాటుకున్నారు. కాబట్టి ఈ సినిమా టెక్నికల్ అంశాల పరంగా అయితే కొంతవరకు పర్లేదు అనిపించింది…
ప్లస్ పాయింట్స్
కథ
లీడ్ ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ట్విస్ట్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ స్లో అయింది
మ్యూజిక్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5
