Brahmanandam Vs Johnny Lever: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు ఉన్నప్పటికి ఒక ఇద్దరు కమెడియన్స్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన కెరియర్ లో ఆయన సాధించిన ఘనత అంతా కాదు.తెలుగులో ఉన్న అందరి స్టార్ హీరోస్ తో నటించి గొప్ప విజయాలను అందుకున్నాడు. 1000కి పైన సినిమాల్లో నటించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్’ రికార్డ్ సృష్టించిన ఒకే ఒక్క కామెడీ నటుడు తనే కావడం విశేషం… మరి కామెడీతో పాటు ప్రేక్షకులను ఎమోషన్ కి గురిచేసిన క్యారెక్టర్ లను కూడా తను చాలా అలవోక గా పోషించి మెప్పించగలరు. కానీ ముఖ్యంగా ఆయనను కామెడీ ప్రాధాన్యం ఉన్న పాత్రలకు మాత్రమే ఎంచుకోవడం విశేషం…తన ఇంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు చేయనటువంటి పాత్ర అయితే లేదు. ఏ పాత్ర చేసిన కూడా అల్టిమేట్ గా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడమే బ్రహ్మానందం యొక్క పని…ఇక మాస్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాలో ఆయన కామెడీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది…ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం లో బ్రహ్మానందం కీలక పాత్ర వహించాడు…
ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ లివర్ సైతం తన కామెడీతో ఎన్నో సినిమాలను విజయతీరాలకు చేర్చాడు. తన టైమింగ్ గాని, ఆయన చేసే మిమిక్రీ గాని, పాత్ర లో ఒదిగిపోయి నటించే విధానం గాని అన్ని తనలో ఉన్న పొటెనీషియల్టీ ని బయటకు తీసి చూపించాయి.
ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనను ఢీకొట్టే వారు లేరనేది వాస్తవం… ఆయన ఎంటైర్ కెరియర్లో ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో ‘బాజిగర్’ ఒకటి…ఈ సినిమాలో ఆయన కామెడీకి పడి పడి నవ్వుకుంటారు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న మీమ్స్ కి అటు బ్రహ్మానందం, ఇటు జానీ లివర్ ఇద్దరిని కలిపి వాడేసుకుంటూ మొత్తానికైతే మీమర్స్ ఫన్ ను క్రియేట్ చేస్తున్నారు…
పాన్ ఇండియాలో వీళ్ళిద్దరి కామెడీని టచ్ చేసే నటులైతే ఎవ్వరు లేరు. ఈ మధ్యకాలంలో వచ్చే సాహసం కూడా ఎవరూ చేయలేరు. మరి ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వీళ్ళిద్దరి నటనకు సెల్యూట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…