Akshaya Patra Fraud: దేశంలో మోసాలు పెరుగుతున్నాయి. కొత్త తరహా ప్లాన్లతో ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటూ అమాయకుల జేబు గుళ్ల చేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో మోసాల బారిన పడుతున్నారు. నిలువెల్లా దోపిడీకి గురవుతున్నారు. కానీ ఆశలు మాత్రం చావడం లేదు. దీంతో మోసాలకు కేంద్రంగా నిలుస్తున్నారు. మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వారు కూడా ఉంటారు. ఏదో మనం పొరపాటున చేసే పనులు మనకు కళంకం తెస్తాయి.

తాజాగా జగిత్యాల అర్బన్ మండలంలోని హస్నాబాద్ లో జరిగిన తాజా సంఘటన దీనికి తార్కాణంగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన కడప శ్రీనివాస్ జగిత్యాల బీట్ బజారుకు చెందిన రాయిల్ల రాయికుమార్ ను కలిశాడు. సులభంగా డబ్బు సంపాదించే మార్గం ఉందా అని అడిగాడు. దీంతో అతడు అక్షయపాత్ర గురించి వివరించాడు. దీనికి డబ్బు ఖర్చవుతుందని నమ్మబలికాడు. అతడితోపాటు హైదరాబాద్ కు చెందిన దండె కార్తీక్, బవికుమార్, మంచిర్యాలకు చెందిన బోకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్ కుమార్ లను శ్రీనివాస్ వద్దకు తీసుకొచ్చాడు. మహిమ గల అక్షయపాత్ర తన దగ్గర ఉందని నమ్మబలికాడు. అందులో నీరు పోసుకుని ప్రతి రోజు ఉదయం తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు.
అక్షయపాత్ర వల్ల పాము కాటు వేసినా ఏం కాదని నమ్మించారు. పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని వారిలో విశ్వాసం కలిగించారు. అక్షయపాత్ర కొనుగోలు చేస్తే రూ.10 లక్షలు ఖర్చవుతుందన్నారు. దీంతో డబ్బులు చెల్లించి దాన్ని శ్రీనివాస్ కొనుగోలు చేశాడు. డబ్బులు ఎంతకు రెట్టింపు కాకపోవడంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. తాను మోసపోయానని గుర్తించాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేశ్ రెడ్డి, రూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం రావుల సాయికుమార్ ఇంటికి వెళ్లారు. అతడిని అదుపులోకి తీసుకున్నాు. ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు.

ఆగాన వచ్చింది బోగాన పోతుందని తెలిసినా ఈజీగా వచ్చే మనీ కోసం చాలా మంది ఆత్రం పడుతున్నారు. గుప్త నిధుల కోసం ప్రయత్నింటారు. జనాన్ని మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. దీనికి గాను సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించాలని కలలు కంటున్నారు. దీంతో కటాకటాలపాలవుతామని తెలిసినా పట్టించుకోవడం లేదు. చివరకు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈజీగా వచ్చే మనీ కోసం కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. లోకంలో మోసం చేస్తూ బతికే వాళ్లు ఎప్పటికైనా కష్టాలు పడాల్సిందే.
లంకె బిందెల పేరుతో మోసగాళ్ల ముఠా బురిడీ కొట్టిస్తోంది. అందిన కాడికి దండుకుంటూ అక్షయపాత్ర పేరుతో మోసపోవడంతో జనం ఇప్పటికైనా అప్రమత్తం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. అబద్ధాలతో మోసాలకు పాల్పడటంతో నష్టం కలుగుతుందని తెలిసినా ఆగడం లేదు. అరచేతిలో అప్పనంగా వచ్చే డబ్బు కోసమే ప్రయత్నిస్తున్నారు. చివరకు మోసాలకే బలవుతున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండి మోసాలకు గురికావద్దని హెచ్చరిస్తున్నారు.