Malti Sharma: సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. కానీ అందరికి ఆ అదృష్టం వరించకపోవచ్చు. ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను వదిలేసి సినిమా మీద ఉన్న ఇష్టంతో హైదరాబాద్, ముంబైకి బయలుదేరి వెళ్తుంటారు ఎందరో. కానీ సక్సెస్ అవకపోతే డిప్రెషన్ లోకి వెళ్లే వారు కొందరు అయితే.. రాంగ్ స్టెప్స్ తీసుకొని జీవితాలను నాశనం చేసుకునే వారు మరికొందరు. ఇదే విధంగా ఓ నటి తన కెరీర్ ను నాశనం చేసుకుంది. ఆమె ఎవరో కాదు భోజ్ పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి మాలతి శర్మ.
గతంలో ఈ అమ్మడు దర్శక నిర్మాతల మొదటి ఎంపికగా ఉండేది. కానీ ఈమె సినిమాలు ఫ్లాప్ అవడం ప్రారంభమవడంతో ఇక ఆమె వైపు చూసే సినీ పెద్దలు లేకపోయారు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లింది మాలతి. మాలతి శర్మ గ్లామర్ ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని అనుకుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అకస్మాత్తుగా పనిలేకపోవడంతో..ఆమెను పొగిడిన వారే విస్మరించడం ప్రారంభించారు. పని లేకపోవడం, డబ్బు లేకపోవడంతో మిథాలీ శర్మ ముంబై చేరి భిక్షాటన కూడా చేయవలసి వచ్చింది. ఇదిలా ఉంటే ముందు నుంచే ఈమె సినీ ఫీల్డ్ కు వెళ్లడం ఇంట్లో వారికి ఇష్టం లేదట.. అందుకే ఇంటి గడప తొక్కలేకపోయింది ఈ నటి.

భిక్షాటన మాత్రమే కాదు దొంగతనాలు కూడా చేసిందట ఈ నటి. ముంబైలోని లోఖండ్‌వాలా వీధుల్లో భిక్షాటన చేసే ఆమె ఒకసారి దొంగతనం చేస్తూ పట్టుబడిందట. ఆ తర్వాత పోలీసులు ఆమెన్ అరెస్ట్ చేశారని టాక్. మిథాలీ మానసిక పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మహిళా పోలీసులపై కూడా ఆమె దుర్భాషలాడిందని అంటున్నారు. అయితే ఈమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్తే.. ఆకలి అవుతుందని ఆహారం అడిగిందట. దీంతో ఆమె చాలా రోజులు ఆకలితో ఉందని గుర్తించారు. ఇక మానసిక స్థితి కూడా బాగాలేదని తెలుసుకున్న పోలీసులు థానేలోని మానసిక ఆశ్రమంలో చేర్చించారట. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారట.