South Africa Eagle: సాధారణంగా మనుషులు తమకు అనుకూలమైన వాతావరణంలోనే ప్రయాణం సాగిస్తారు. అనుకూలమైన దారుల్లోనే వెళ్తుంటారు. ఎందుకంటే ప్రయాణం చేసే విషయంలో ప్రయోగాలకు తావు ఇవ్వకూడదని.. అనవసరంగా ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని భావిస్తుంటారు. అందువల్లే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు.. కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా తినే ఆహారం, తాగే నీటిలో ముందుచూపుతో వ్యవహరిస్తుంటాయి. పైగా వాతావరణంలో మార్పులను కూడా అవి వెంటనే పసిగడుతుంటాయి.. జంతువులు అలా ఎందుకు ప్రవర్తిస్తాయో.. వాటికి ప్రకృతి ముందుగా ఎలాంటి సంకేతాలు ఇస్తుందో.. అధికారుల పరిశీలనలో తేలింది.
Also Read: సాక్షి ఎదగలేకపోయింది.. ఈనాడు నిరూపించలేకపోయింది.. తెలుగు మీడియాకు ఇదో పాఠం..
సౌత్ ఆఫ్రికాలో ఓ గద్దకు జిపిఎస్ ట్రాకర్ అమర్చారు. అది రోజుల తరబడి పని చేసే విధంగా బ్యాటరీ సదుపాయం కల్పించారు. అక్కడినుంచి గద్ద ఎగిరిపోయింది. యూరప్ లోని ఫిన్లాండ్ దేశం వరకు ఆ గద్ద ప్రయాణించింది. ఈ ప్రయాణానికి 42 రోజులపాటు సమయాన్ని తీసుకుంది. గద్ద ప్రయాణించిన మార్గాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.. ఆ గద్ద ప్రయాణం సాగిస్తూనే.. మధ్య మధ్యలో ఆగి వేటాడింది. తాను జీవించడానికి గానూ ఆహారం తీసుకుంది. మధ్య మధ్యలో ఆగినప్పటికీ రోజుకు 230 కిలోమీటర్ల దూరం అది ప్రయాణించింది. పైగా అది సరళరేఖలో ఎగిరింది.. ఇలా ఎగరడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అది ఎగురుతున్న ప్రాంతంలో మధ్యదర, నల్ల సముద్రాలు ఉన్నాయి. వాటికి దూరంగా అది ఎగిరింది. ఎందుకంటే మార్గమధ్యలో దానికి దాహం వేస్తే సముద్రం నీటిని తాగలేదు. భూభాగం మీదుగా ప్రయాణించింది.
భూభాగం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు నదులు.. ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాన్ని చూసుకుంది. ఆ ప్రాంతాలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. చిన్న చిన్న కీటకాలను వేటాడి తన ఆహారాన్ని సంపాదించుకొని మళ్ళీ ఎగరడం మొదలు పెట్టింది.. అయితే గద్ద ప్రాంతాలకు తగ్గట్టుగానే తన ఆహారాన్ని మార్చుకుంది. శీతల ప్రాంతాలలో చిన్నచిన్న కీటకాలను తిన్నది. సమ శీతోష్ణ ప్రాంతాలలో చేపలను ఆహారంగా తీసుకుంది. బాగా వేడిగా ఉండే ప్రాంతాలలో అయితే పెద్ద పెద్ద కీటకాలను ఆహారంగా తీసుకుంది.. శరీర బడలిక తీర్చుకోవడానికి ఎక్కువగా పర్వత ప్రాంతాలలో సేద తీరింది. సాధ్యమైనంతవరకు నది జలాలు ఉన్న ప్రాంతంలోనే అది ప్రయాణించింది.
” మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా విచిత్రంగా ఆలోచిస్తుంటాయి. తమ భద్రత గురించి ఆత్రుత పడుతుంటాయి. అందువల్లే అవి భద్రంగా ఉంటాయి. తాగే నీరు విషయంలో.. తినే తిండి విషయంలో కచ్చితత్వంతో ఉంటాయి. అందువల్లే వాటి మనుగడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. ప్రకృతి వాటికి సంకేతాలు పంపిస్తుంది. అందువల్లే అవి జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తుంటాయని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు.