
Niloufer Tea Cost: కొన్ని కొన్ని రెస్టారెంట్స్ మరియు కాఫీ షాప్స్ లో ఎలాంటి విశేషం లేని ఐటమ్స్ కూడా ఆకాశాన్ని తాకే రేట్స్ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి రెస్టారెంట్స్ లోకి సామాన్యులు అడుగుపెట్టలేరు, ఒకవేళ అడుగుపెట్టారంటే కడుపు నిండా తినాలి అనుకుంటే మాత్రం మీరు నెల మొత్తం సంపాదించిన డబ్బులను ఇక్కడ ఇచ్చుకోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటాయి రేట్స్.
ప్లేట్ ఇడ్లీ ( కేవలం రెండు మాత్రమే) 200 రూపాయిలు ఉండే రెస్టారెంట్స్ హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. పోనీ వీటిలో స్పెషల్ ఎమన్నా ఉంటుందా అంటే ఏమి లేదు.. మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో విజయవంతంగా రన్ అవుతున్నాయి. అంటే జనాలు బాగా ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. హైదరాబాద్ లో అంత రిచ్ పీపుల్ ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్.
ఇది ఇలా ఉండగా బంజారా హిల్స్ లోని ‘నిలోఫర్’ కేఫ్ లో రీసెంట్ గా ఒక నెటిజెన్ టీ తాగడానికి వెళ్లగా, అక్కడ ఉన్న రేట్స్ చూసి అతగాడికి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఆ కేఫ్ లో ఎంతో ప్రత్యేకమైన ‘గోల్డెన్ టిప్స్ టీ’ లో విశేషం ఏమిటో తెలుసుకుందాం అని ఆర్డర్ ఇచ్చారట. ఇది ఎంతో అరుదైన టీ అని చెప్పి వెయిట్ మెషిన్ తో టీ పౌడర్ వేసి చెక్ చేసాడట. ఎందుకు అలా వెయిట్ చెక్ చేస్తున్నారు అని అడిగితే ఈ టీ ఒక కేజీ 75 వేల రూపాయిలు ఉంటుంది అని వెయిటర్ చెప్పాడట.

ఏంటో అంత స్పెషల్ ఈ టీ లో అని టేస్ట్ చేసిన తర్వాత అది చాలా సాధారణమైన టీ. మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది,తీరా టీ త్రాగి బిల్ అడిగితే వెయ్యి రూపాయిలు చెప్పేలోపు ఆ నెటిజెన్ కి గుండె ఆగినంత పని అయ్యిందట. ఇక్కడ మన ఇళ్లల్లో చేసుకునే ఐటమ్స్ ఇలాంటి హోటల్స్, రెస్టారెంట్స్ మరియు కాఫీ షాప్స్ లో ఇష్టమొచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.