
NTR- Koratala Siva Movie: ఇప్పుడున్నవారిలో ఊరమాస్ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే షాక్ అయింది. అందుకు తగ్గట్టుగానే తరువాత సినిమా ఉండాలని ఫ్యాన్ష్ కోరుకున్నారు. వారి కోరిక మేరకు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్టోరీని రచించినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో సాగే #NTR30 లాంచింగ్ ఇటీవలే జరిగింది. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని కొరటాల చేసిన కామెంట్ష్ ఆడియన్స్ లో జోష్ తెప్పించాయి. ఈ తరుణంలో #NTR30 కి సంబంధించి ఓ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. #NTR30 పేరుతో ఉన్న ఓ ట్యాంకర్ ను చూపిస్తూ దానిపై నుంచి బ్లడ్ కారుతోంది. అంటే ఎన్టీఆర్ కోసం ఏకంగా బ్లడ్ ట్యాంకర్ నే తెచ్చారన్న చర్చ సాగుతోంది.
టాలీవుడ్ యంగ్ టైగర్ హీరోగా పేరున్న ఎన్టీఆర్ సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. కొంత మంది డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ యాక్షన్ తగినట్లుగా కథను తీర్చిదిద్దుతారు. లాస్ట్ టైం మూవీ ఆర్ఆర్ఆర్ లో స్టార్ హీరోలు ఇద్దరు నటించినా ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ భారీ యాక్షన్ తో కూడుకొని ఉన్నాయి. ఏకంగా ఆయనతో పులితో ఫైట్ పెట్టి సంచలనం సృష్టించారు. దీంతో ఎన్టీఆర్ ఎలాంటి యాక్షనైనా చేయగలడని ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఈ సినిమా యాక్షన్ తో పాటు సెంటిమెంట్ గా వర్కౌట్ అయింది. అయితే ఇప్పుడు అంతకుమించి అన్నట్లుగా సినిమా ఉండబోతుందని కొరటాల హింట్ ఇచ్చాడు. ఇప్పటికే #NTR30 కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ ఓ కత్తి చేత పట్టుకొని కనిపించారు. ఆ కత్తి మొత్తం రక్తంతో కూడుకొని ఉండగా.. చుట్టూ సముద్రం అల్లకల్లోలమైన దృశ్యాన్ని చూపించారు.
లేటేస్టుగా #NTR30 కు సంబంధించి NTR30 పేరుతో ఉన్న బ్లడ్ ట్యాంకర్ పిక్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పిక్ ను అధికారికంగా విడుదల చేయలేదుని షూటింగ్ స్పాట్ నుంచి లీకైందని అంటున్నారు. సినిమా షూటింగ్ నుంచి ఇలాంటి లీక్ లు కొత్తేమీ కాదు. కానీ సినిమాపై ఇంప్రెషన్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఈ పిక్ ను బయటపెట్టారని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ బ్లడ్ ట్యాంకర్ ను చూస్తే #NTR30 సినిమా రక్తమోడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే ఇది నిజంగానే బ్లడ్ ట్యాంకరా? లేక ట్యాంకర్ పై ఫైట్ సీన్ జరిగిందా? అనేది తెలియాలి.