https://oktelugu.com/

Vikarabad: ప్రేమించాడు.. ఓరోజు యువతితో ఎంజాయ్‌ చేశాడు.. కోరిక తీరాక ఇలా చేశాడు..

Vikarabad: ప్రేప పేరుతో యువతుల వెంట పడడం.. తర్వాత దగ్గర కావడం, అవసరం తీరాక వదిలేయడం, లేదా చంపేడయం లాంటి ఘటనలు ఈ రోజుల్లో సాధారణంగా మారాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యువతలో మార్పు రావడం లేదు. కామాంధులు మృగాలుగా మారుతున్నారు. కోరిక తీర్చకునేందుకు ప్రేమను నటిస్తున్నారు. తాజాగా ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన విశ్వనగరం హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగింది. ప్రేమిస్తున్నానని.. బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న వికారాబాద్‌ జిల్లా […]

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 6, 2023 / 05:29 PM IST
    Follow us on

    Vikarabad

    Vikarabad: ప్రేప పేరుతో యువతుల వెంట పడడం.. తర్వాత దగ్గర కావడం, అవసరం తీరాక వదిలేయడం, లేదా చంపేడయం లాంటి ఘటనలు ఈ రోజుల్లో సాధారణంగా మారాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యువతలో మార్పు రావడం లేదు. కామాంధులు మృగాలుగా మారుతున్నారు. కోరిక తీర్చకునేందుకు ప్రేమను నటిస్తున్నారు. తాజాగా ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన విశ్వనగరం హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగింది.

    ప్రేమిస్తున్నానని..
    బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం పర్సాపూర్‌ గ్రామానికి చెందిన వాంకుడోతు మహిపాల్‌ నాయక్‌(27)కు పోచంపల్లి ఠాణా పరిధిలోని ఓ కళాశాల అతిథి గృహంలో నివసించే నారాయణపేట జిల్లాకు చెందిన యువతి(20)తో తొమ్మిది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అతని మాటలు నమ్మి ఆమె ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నెల 21న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మహిపాల్‌ ఆమె ఫోన్‌ నంబరు బ్లాక్‌ చేశాడు. దీంతో మనస్తాపానికి గురై యువతి గత నెల 30న హాస్టల్‌ భవనం నుంచి కిందకు దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలవ్వగా హాస్టల్‌ నిర్వాహకులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం పోచంపల్లి ఠాణాలో యువతి ఫిర్యాదు చేయగా అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు చేసి బంజారాహిల్స్‌ ఠాణాకు బదిలీ చేశారు.

    Vikarabad

    గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా..
    ఇక యువతులు కూడా గొర్రె కసాయి సామెతలా మారుతున్నారు. తమ చిన్నచిన్న కోరికలు తీర్చుకోవడానికి, తనకూ ఓ బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని బిల్డప్‌ ఇవ్వడానికి, ఆర్థిక అవసరాల కోసం అబ్బాయిల తోడు కోరుకుంటున్నారు. వారు అడినవి ఇస్తూ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. దీంతో అబ్బాయిల్లోని మృగాడు బయటకు వస్తున్నాడు. నమ్మకం కుదిరిందని తెలిసాక, తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. వాడుకుని వదిలేస్తున్నారు. అలా కుదరని పక్షంలో చంపడానికీ వెనుకాడడం లేదు. అయినా అమ్మాయిలు మోసం చేసే మగవాళ్లనే నమ్ముతూ మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే. తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించకపోవడం, పెడదారి పట్టకుండా చూడడంలో విఫలం కావడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి.