Uttar Pradesh: ఇరుకు వీధిలో కారు రివర్స్‌.. ఎంత ఘోరం జరిగింది.. వీడియో వైరల్‌!

రాజేంద్రగుప్తా చక్రాల కింద నలుగుతున్నా డ్రైవర్‌ గుర్తించలేదు. అలాగే రివర్స్‌ తీశాడు. కారు అతని పై నుంచి వెళ్లింది. తర్వాత అతను బయటకు వచ్చాడు.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 4:15 pm

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh: ఇరుకు వీధిలో ఓ కారు డ్రైవర్‌ వాహనాన్ని రివర్స్‌ తీస్తూ.. ఓ వృద్ధుడిపైకి ఎక్కించాడు. ఈ భయానక ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన గగ్గుర్పొడిచే దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏం జరిగిందంటే..
ఇరుకు వీధిలో అప్పటికే రెండు వాహనాలు ఇరువైపులా నిలిపి ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి ఓ వ్యక్తి తన కారును రివర్స్‌ చేసేందుకు యత్నించాడు. అదే సమయంలో రాజేంద్రగుప్తా అనే 70 ఏళ్ల వృద్ధుడు అటుగా వెళ్తున్నాడు. దీనిని గమనించని డ్రైవర్‌ వెనక్కి నడుపుతూ వృద్ధుడిని ఢీకొట్టాడు. దీంతో అతను కిందపడిపోయాడు.

చక్రాల కింద నలుగుతున్నా..
రాజేంద్రగుప్తా చక్రాల కింద నలుగుతున్నా డ్రైవర్‌ గుర్తించలేదు. అలాగే రివర్స్‌ తీశాడు. కారు అతని పై నుంచి వెళ్లింది. తర్వాత అతను బయటకు వచ్చాడు. అయినా గమనించని డ్రైవర్‌ మళ్లీ కారును ముందుకు తీసుకువస్తూ మరోమారు అతనిపైకి ఎక్కించాడు. దీంతో స్థానికులు గమనించి కేకలు వేయడంతో కారును అలాగే నిలిపాడు. దీంతో కారు టైర్లకింద రాజేంద్రగుప్తా నలుగుతూ కేకలు వేయడంతో స్థానికులు కానును నెమ్మదిగా వెనక్కు తీయించారు. తర్వాత అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు..
ఈ ఘటన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వాటి ఆధారంగా రాజేంద్రగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నాడా అని కొందరు. కొత్తగా నడుతుపున్నాడా అని మరికొందరు. డ్రైవర్‌ను కూడా అలాగే చేయాలని ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు.

https://twitter.com/i/status/1793876999267897475