https://oktelugu.com/

ఈ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే హోమ్ లోన్..

బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల్లో దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు 10.10 శాతం వడ్డీ రేటుతో రుణం అందిస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 24, 2024 / 04:03 PM IST

    Home loan

    Follow us on

    ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ యూనివర్సల్ కోరిక సొంత ఇల్లు నిర్మించుకోవడం. సొంత ఇంట్లో ఉన్న తృప్తి వేరే ఉంటుంది. దీంతో రకరకాల ప్రణాళికల ద్వారా కొత్త ఇల్లు సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఇల్లు కట్టుకోవడానికి కొంత మంది వద్ద సరైన బడ్జెట్ ఉండదు. దీంతో బ్యాంకు ద్వారా రుణం తీసుకొని కొనుక్కుంటారు. ఇల్లు కట్టుకునేవారికి బ్యాంకు రుణం తక్కువ వడ్డీకే వస్తుంది. ఓవరాల్ 9 శాతం వడ్డీ రేటుతో ప్రారంభమై 11.40 వడ్డీ రేటు శాతంతో లోన్ వస్తుంది . అయినా బ్యాంకుల మధ్య పోటీ ఉండడంతో కొన్ని బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేటుకే లోన్లు ఇస్తుంటాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రతీ అవసరానికి లోన్ తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. కానీ వ్యక్తిగత రుణం కంటే స్థిరాస్తి ద్వారా లోన్ తీసుకోవడం ఉత్తమమని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆస్తిపై ఇచ్చే రుణం ద్వారా తమ ఆస్తులకు ఎలాంటి భంగం కలగకుండా కావాల్సినంత రుణం సాయం అందుతుంది. దీనినే ఎల్ఏపీ లోన్ అంటారు. ఎల్ ఏపీ ద్వారా రుణం 9.5 శాతం వడ్డీ రేటు నుంచి ప్రారంభం అవుతుంది. అయితే వ్యక్తిగత ప్రొఫైల్, ఆస్తి స్వభావం వంటి వాటిపై ఇంకా తక్కువ వడ్డీ కే వచ్చే అవకాశం ఉంది.

    బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల్లో దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు 10.10 శాతం వడ్డీ రేటుతో రుణం అందిస్తుంది. 7 సంవత్సరాల పాటు ఆస్తిపై రూ.15 లక్షల వరకు రుణం అందుతుంది. ఎస్బీఐ ఖంటే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందవచ్చు. ఈ బ్యాంకు 9.5 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు.

    యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.15 లక్షల రుణం తీసుకొని 7 సంవత్సరాల పాటు టెన్యూర్ పెట్టుకుంటే 10.50 వడ్డీరేటు శాతం విధిస్తారు. దీనికి ఈఎంఐ రూ.25,072 చెల్లించాల్సి ఉంటుంది. యూనియన్ బ్యాంకు నుంచి అయితే ఇదే మొత్తానికి 10.55 వడ్డీ రేటు విధిస్తారు. కెరనా బ్యాంకులో 11.05 వడ్డీ శాతం, బ్యాంకు ఆఫ్ బరోడాలో 10.85 ఇంట్రెస్ట్ పడుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 11.35 శాతం వడ్డీ రేటును విధిస్తున్నారు.