https://oktelugu.com/

TollyWood : బాలయ్య పక్కన ఉన్న ఉంగరాల జుట్టు పిల్లగాడు ఓ స్టార్ హీరో… ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అతనొక్కడే చిత్రంతో మొదటి హిట్ కొట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ. ఒక్క హిట్ పడితే వరుసగా పరాజయాలు ఎదురవుతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2024 / 10:08 PM IST

    Balakishna - Kalyan Ram

    Follow us on

    TollyWood : నందమూరి బాలయ్య పక్కన ఉన్న ఈ బాలుడు టాలీవుడ్ హీరో. నందమూరి వారసుల్లో ఒకడు. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆ బాలుడు ఎవరో గుర్తు పట్టారా? మీ అంచనా నిజమే… ఈ ఉంగరాల జుట్టు బుల్లోడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రంలోని లుక్ అది. హరికృష్ణ కుమారుల్లో ఒకడైన కళ్యాణ్ రామ్ 1989లో విడుదలైన బాలగోపాలుడు చిత్రంలో నటించాడు. ఆ చిత్రంలో హీరో బాలయ్య వద్ద ఒక అమ్మాయి, అబ్బాయి అనాథ బాలలుగా పెరుగుతారు. సదరు బాలుడు పాత్ర కళ్యాణ్ రామ్ చేశాడు.

    దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన బాల గోపాలుడు అప్పట్లో సూపర్ హిట్. సుహాసిని హీరోయిన్ గా నటించింది. మోడరన్ అమ్మాయిగా సుహాసిని కనిస్తుంది. ఇక పల్లెటూరి అబ్బాయి పాత్రలో బాలకృష్ణ మెస్మరైజ్ చేశాడు. ఆ చిత్రంతో బాల నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన కళ్యాణ్ రామ్ 2003లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలిచూపులోనే ఆయన డెబ్యూ మూవీ. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    అతనొక్కడే చిత్రంతో మొదటి హిట్ కొట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ. ఒక్క హిట్ పడితే వరుసగా పరాజయాలు ఎదురవుతాయి. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో కళ్యాణ్ రామ్ హిట్ చిత్రాలంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, వసిష్ఠ దర్శకత్వంలో చేసిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్లో హిట్ చిత్రాలుగా ఉన్నాయి.

    బాలకృష్ణ, ఎన్టీఆర్ ల రేంజ్ స్టార్ డమ్ కళ్యాణ్ రామ్ కి రాలేదు. ఆయన కనీసం టైరు టు హీరోల జాబితాలో కూడా లేరు. అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు నిర్మాతగా చిత్రాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు ఎన్టీఆర్ తో దేవర నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కుతుంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. అక్టోబర్ 10న దసరా పండుగకు విడుదల చేస్తున్నారు.