Hyderabad: ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు పోలీసులకు ఏమాత్రం ఉప్పందినా.. కొంతలో కొంత అనుమానం వచ్చిన వెంటనే ఆ వాహనాన్ని ఆపేస్తారు. ప్రయాణికుడిని తనిఖీ చేస్తారు. ఇందులో భాగంగా అతడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తారు. 100 మిల్లీమీటర్ల రక్తంలో ఎంత స్థాయిలో మద్యం ఉందనేది పరిగణిస్తారు.. వారి లెక్కల ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములకు మద్యం స్థాయి దాటిపోతే కేసు నమోదు చేస్తారు.. ఒకవేళ 30 మిల్లీగ్రాములను దాటి 50 మిల్లి గ్రాములు కనుక మద్యం స్థాయి ఉంటే ఆ వ్యక్తి స్పృహలో లేడని పోలీసులు పరిగణిస్తారు. అయితే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బ్రీత్ అనలైజర్ టెస్టులో 100 మిల్లీగ్రాముల రక్తంలో 100% ఆల్కహాల్ నమోదైనట్టు ఇంతవరకు లేదు. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్రాంతంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పోలీసులు డిసెంబర్ 31 రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి బ్రీత్ అనలైజర్ లో నోరు పెట్టి గాలి ఊదమన్నారు. అతడు ఊదగానే బ్రీత్ అనలైజర్ దెబ్బకు షేక్ అయింది. ఏకంగా 550 రీడింగ్ చూపించింది. దీంతో పోలీసులు షాక్ య్యారు..
ఓ వ్యక్తిని ఆపి..
డిసెంబర్ 31 మంగళవారం రాత్రి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తమ తనిఖీలలో భాగంగా బంజర హిల్స్ రోడ్ నెంబర్ -1, వెంగళరావు పార్క్ సమీపంలో సోదాలు మొదలుపెట్టారు. ఆ మార్గంలో ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అతడిని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అతడు విపరీతంగా మద్యం తాగడంతో 550 రీడింగ్ చూపించింది.. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆ వ్యక్తి పేరు ఏంటనేది పోలీసులు బయట పెట్టలేదు. అతడు నడపదెలా ద్విచక్ర వాహనం మాత్రం రియాజుద్దీన్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. బైకును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.. అయితే ఆ బైక్ పై. డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదయింది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారంటూ పోలీసులు ఫైన్ కూడా విధించారు. ఆ బండి మీద దాదాపు పది చలనాలు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా హెల్మెట్ కు సంబంధించినవి కావడం విశేషం. అయితే ఇంతవరకు పోలీసుల నిరూపించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లలో ఎవరు కూడా ఈ స్థాయిలో మద్యం తాగిన దాఖలాలు కనిపించలేదు. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించడం.. పోలీసులు సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు చేయడంతో చాలావరకు జనం రోడ్లమీదకి రాలేదు. నగరంలోని పలు ప్రాంతాలలో పార్టీలు చేసుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల తర్వాత ఇళ్లకు బయలుదేరారు. అప్పటికి పోలీసులు తనిఖీలను తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆపేశారు. అయితే ఐటి కంపెనీలు ఉండే మాదాపూర్, దుర్గం చెరువు, రాయదుర్గం, నానక్ రామ్ గూడ ప్రాంతాలలో భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా భారీగా జరిమానా విధించడంతో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు దండిగాని ఆదాయం వచ్చినట్టు సమాచారం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A breathalyzer test showed a high alcohol reading
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com