Homeట్రెండింగ్ న్యూస్Google Maps: గుగూల్‌ను నమ్మకున్నారు.. జంగల్‌లో ల్యాండ్‌ అయ్యారు.. గోవాలో అడవిలో చిక్కుకున్న ఓ కుటుంబం...

Google Maps: గుగూల్‌ను నమ్మకున్నారు.. జంగల్‌లో ల్యాండ్‌ అయ్యారు.. గోవాలో అడవిలో చిక్కుకున్న ఓ కుటుంబం వ్యథ

Google Maps: ఒకప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అడ్రస్‌ అడుక్కుంటూ వెళ్లేవారం. కొన్ని పట్టణాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఉండేవి. ఇక గ్రామాలకు వెళ్తే వ్యక్తు పేర్లు, ఇంటిపేర్లు చెబితే అడ్రస్‌ చెప్పేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. టెక్నాలజీ పెరగడంతో అందరూ గూగుల్‌ను నమ్ముకుంటున్నారు. కొత్త ్ర‘పదేశాలకు వెళ్లేవారంతా గూగుల్‌ను నమ్ముకుంటున్నారు. గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకుని వెళ్తున్నారు. గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని చాలా మంది ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నా.. చాలా మంది ఇప్పటికీ దీనినే ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు కారులో పెళ్లికి బయల్దేరారు. రూట్‌ మ్యాప్‌ కోసం గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకున్నారు. అయితే వంతెన కూలిపోయి ఉన్న విషయం తెలియక వేగంగా వెళ్లి నదిలో పడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురూ దుర్మరణం చెందారు.

గోవా అడవిలో..
తాజాగా గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని గోవాకు వెళ్లిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపింది. బిహార్‌కు చెందిన రాజ్‌దాస్‌ రంజిత్‌దాస్‌ కుటుంబం కారులో గోవాకు బయల్దేరింది. ఈ కుటుంబంలో చిన్నారులతోపాటు మొత్తం ఆరుగురు ఉన్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ పెట్టుకుని కర్నాటకలోని బెలగాని జిల్లా ఖానాపూర్‌ దాటిన తర్వాత షిరోడగ, హెమ్మగూడ గ్రామాల మధ్య గుండా దారి చూపింది. దానిని అనుసరించి న వీరు బీమగగ్‌ వైల్డ్‌లైఫ్‌ జోన్‌లో ఏడు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. ఆ ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ కూడా లేదు. అప్పటికే చీకటి పడింది. దీంతో ఎటు వెళ్లాలో తెలియక రాత్రంతా అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అడవి జంతువుల బారిన పడకుండా కారు లాక్‌ చేసుకుని ఉండిపోయారు.

ఉదయం వెనక్కి..
తెల్లవారిన తర్వాత కారులో మళ్లీ మూడు కిలోమీటర్లు వెనక్కి వచ్చారు. అక్కడ మొబైల్‌ నెట్‌వర్క్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి సహాయం కోరారు. వారు అక్కడకు చేరుకుని బెలగావి పోలీస్‌ కంట్రోల్‌ రూం ఖానాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్థులు, జీపీఎస్‌ సాయంతో కుటుంబాన్ని గుర్తించి రక్షించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version