https://oktelugu.com/

Bihar Boy: అమ్మాయిలను చూస్తే అతను అంతే.. పరీక్ష హాల్‌లోనే స్పృహ తప్పాడు!

Bihar Boy: మనుషుల్లో అందరికి ఒక్కో రకమైన ఫోబియా ఉంటుంది. కొందరికి నీరంటే.. కొందరికి నిప్పంటే.. కొందరికి రక్తమంటే భయం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి చాలామంది వాటికి దూరంగా ఉంటారు. అనుకోకుండా ఎదురు పడితే స్పృహతప్పి పడిపోతారు. బీహార్‌లో ఓ విద్యార్థికి విచిత్రమైన ఫోబియో ఉంది. అతనికి అమ్మాయిలంటే భయం.. వారిని చూడగానే కళ్లు తిరిగి పడిపోతాడు. తాజాగా పరీక్ష కేంద్రానికి వెళ్లిన సదురు విద్యార్థి హాల్‌లో ఎక్కువ మంది విద్యార్థినులను చూసి కళ్లుతిరిగి పడిపోయాడు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 2, 2023 / 12:57 PM IST
    Follow us on

    Bihar Boy: మనుషుల్లో అందరికి ఒక్కో రకమైన ఫోబియా ఉంటుంది. కొందరికి నీరంటే.. కొందరికి నిప్పంటే.. కొందరికి రక్తమంటే భయం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి చాలామంది వాటికి దూరంగా ఉంటారు. అనుకోకుండా ఎదురు పడితే స్పృహతప్పి పడిపోతారు. బీహార్‌లో ఓ విద్యార్థికి విచిత్రమైన ఫోబియో ఉంది. అతనికి అమ్మాయిలంటే భయం.. వారిని చూడగానే కళ్లు తిరిగి పడిపోతాడు. తాజాగా పరీక్ష కేంద్రానికి వెళ్లిన సదురు విద్యార్థి హాల్‌లో ఎక్కువ మంది విద్యార్థినులను చూసి కళ్లుతిరిగి పడిపోయాడు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    Bihar Boy

    ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వచ్చి..
    బిహార్‌కు చెందిన మనీశ్‌ శంకర్‌(17) అల్లామా ఇక్బాల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. బుధవారంపరీక్ష రాసేందుకు వెళ్లాడు. హాల్‌లో ఎక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థినులను చూసి పరీక్ష హాల్‌లోనే స్పృహ తప్పాడు. సిబ్బంది అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

    సెంటర్‌కు తీసుకొచ్చిన తండ్రి..
    మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌కు తీసుకొచ్చాడు.షెడ్యూల్‌ ప్రకారం గణిత పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు మనీశ్‌ హాల్‌లోకి వెళ్లాడు. పరీక్ష హాల్‌లో ఉన్న బాలికలను చూసి విద్యార్థి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయాడు. ఒకేసారి అంత మంది విద్యార్థినులను చూడగానే మనీశ్‌ కంగారుపడి సృ ్పహ తప్పిపోయాడని అతడి మేనత్త వెల్లడించారు.

    Bihar Boy

    ఆశ్చర్యకరమైన ఫోబియా..
    సాధారణంగా విద్యార్థులకు పరీక్షలంటే ఫోబియా ఉంటుంది. విచిత్రంగా మనీశ్‌కు విద్యార్థినులు ఫోబియా ఉంది. తక్కువ మంది ఉంటే పెద్దగా అతడికి భయం ఉండదని, ఎక్కువ మందిని ఒకేసారి ఒక్కచోట చూసే సరికి ఇలా కళ్లు తిరిగి పడిపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే దీనిపై మనీశ్‌ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. కొంతమంది పరీక్ష భయంతోనే ఇలా అయి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సోషల్‌ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

    Tags