Heart Attack: గెండెపోటు ఇటీవల సాధారణం అయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ గుండెపోటు వస్తుంది. అప్పటి వరకు అందరితో కలిసి ఉన్నవాళ్లు కూడా ఒక్కసారి కుప్పకూలుతున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఆస్పత్రిలో గుండోపోటుతో మృతిచెందుతున్నారు. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. కోవిడ్ వ్యాక్సిన్ ఒక కారణమని కొందరు చెబుతున్నారు. అయితే అందులు నిజం లేదని వ్యాక్సిన్ తయారీ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో స్వీడన్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త గుండెపోటును ముందే కనిపెట్టే టెస్టును కనిపెట్టారు.
మామూలుగా చెబితే వినరుగా..
మీకు పొగ తాగే అలవాటు ఉందా.. అయితే వెంటనే మానేయండి లేదంటే గుండెపోటు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇలా చెప్పినా ఎవరూ వినరు. ఆరు నెలల్లో మీకు గుండెపోటు వస్తుంది. వెంటనే పొగ తాగడం, మద్యం తాగడమ మానేయండి. రోజూ వ్యాయామం చేయండి లేదంటే గెండపోటు ఖాయం అంటే అందరూ వింటారు. ప్రమాదం దగ్గరలో ఉంది అంటే జాగ్రత్త తీసుకుంటారు. అందుకే స్వీడన్‌కు చెందిన ఉప్పలా యూనివర్సిటీకి చెందిన జోహన్ 9 సన్హెమ్ అనే ప్రొఫెసర్ ఓ అధునాతన రక్త పరీక్షను కనిపెట్టాడు.
ముందే గుర్తించొచ్చు..
గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే ఈ రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని నిర్దారించారు. గుండెపోటుకు కొద్ది కాలానికి ముందే శరీరంలో కొన్ని అణువులను విడుదల చేస్తుందట. అలాంటి 90 అణువులను ప్రపంచలోని 1.69 లక్షల మంది నుంచి సేకరించి విశ్లేషించడం ద్వారా గుండెపోటు వస్తుందని నిర్ధారించారు ప్రొఫెసర్ జోహన్.
ఇవి ఎక్కువగా ఉంటే..
రక్తంలో విడుదలయ్యే అణువులు ఎంత ఎక్కువగా ఉంటే గుండెపోటు అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఈ అణువులను అత్యంత వేగంగా విశ్లేషించి చెపపడానికి ప్రత్యేకమైన ఆన్‌లైన్ టూల్‌ను సిద్ధం చేశారు. రక్త కణాలతోపాటు జీవిత భాగస్వామి దూరం కావడం, క్యాన్సర్‌లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిని కూడా హైరిస్కు రోగులుగా గుర్తించాలని చెబుతున్నాడు.