https://oktelugu.com/

రానా  ‘హిరణ్య కశ్యప’లో అల్లు అర్జున్‌?   

తెలుగు చిత్ర పరిశ్రమలో  ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. భారీ సెట్లు, పెద్ద తారాగణంతో  పౌరాణిక, కమిర్షియల్‌ కూడా  సినిమాలు తీస్తుంటారాయన. నంది అవార్డుల డైరక్టర్గా ఆయనకు పేరుంది.  ఆయన తీసిన సినిమాలకు ఇప్పటిదాకా తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు వంటి బడా స్టార్లతో  పలు సార్లు పని చేశారాయన. కానీ, ఈ కొంతకాలంగా గుణ శేఖర్ పరాజయాల్లో ఉన్నారు. విజయం రుచి చాలా ఏళ్లవుతోంది. 2003లో  ‘ఒక్కడు’తో బ్లాక్‌ బస్టర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2020 / 08:29 PM IST
    Follow us on

    తెలుగు చిత్ర పరిశ్రమలో  ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. భారీ సెట్లు, పెద్ద తారాగణంతో  పౌరాణిక, కమిర్షియల్‌ కూడా  సినిమాలు తీస్తుంటారాయన. నంది అవార్డుల డైరక్టర్గా ఆయనకు పేరుంది.  ఆయన తీసిన సినిమాలకు ఇప్పటిదాకా తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు వంటి బడా స్టార్లతో  పలు సార్లు పని చేశారాయన. కానీ, ఈ కొంతకాలంగా గుణ శేఖర్ పరాజయాల్లో ఉన్నారు. విజయం రుచి చాలా ఏళ్లవుతోంది. 2003లో  ‘ఒక్కడు’తో బ్లాక్‌ బస్టర్ అందుకున్న ఆయన తర్వాత అర్జున్, సైనికుడు సినిమాలతో నిరాశ పరిచాడు. 2010లో అల్లు అర్జున్‌ హీరోగా తీసిన వరుడు ఓ పెద్ద డిజాస్టర్. రెండేళ్ల తర్వాత రవితేజతో నిప్పు తీసిన ఆయన మళ్లీ చేతులు కాల్చుకున్నాడు. ఆపై, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రుద్రమ దేవి కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. 2015లో వచ్చిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. దీనికి నిర్మాత కూడా తానే కావడంతో గుణశేఖర్ కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే, ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘హిరణ్య కశ్యప’  అనే సినిమాతో మళ్లీ ముందుకురాబోతున్నారు.

    Also Read : మళ్లీ ఈనాడు గ్రూపుకు ఊపు.. రంగంలోకి రామోజీ

    రుద్రమదేవి తర్వాత కొంత విరామం అనంతరం ఈ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారు. గుణశేఖర్,  సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరో. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  భక్త ప్రహ్లాద కథలోని హిరణ్య కశ్యపుడి కోణంలో గుణశేఖర్‌ కథ,  కథనం రాసుకున్నట్టు సమాచారం. బాహుబలి స్థాయిలో రూపొందించాలని చూస్తున్న ఈ ప్రాజెక్టుపై హీరో రానా చాలా ఆసక్తిగా ఉన్నాడు. తొందర్లోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్‌ పనులు పూర్తవగా.. ఇప్పుడు ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసిన పనిలో ఉన్నారు గుణశేఖర్. ఈ క్రమంలో చిత్రంలో ఓ  పాత్రకోసం అల్లు అర్జున్ ను తీసుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. అది సినిమాలో కీలక పాత్ర అని,  చాలా ప్రత్యేకంగా ఉంటుందని, బన్నీ దృష్టిలో ఉంచుకొని గుణ శేఖర్  ఆ పాత్ర తీర్చిదిద్దారని అంటున్నారు.
    గుణ చివరి చిత్రం రుద్రమదేవిలో సైతం బన్నీ.. గోన గన్నారెడ్డి అనే కీలక పాత్ర చేశాడు. పైసా తీసుకోకుండా ఆ సినిమాకు ఒప్పుకున్న బన్నీ.. గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ యాస నేర్చుకున్నాడు. ఎన్నో కసరత్తులు చేసిన అద్భుతంగా మేకోవర్ అయ్యాడు. ఆ పాత్రలో లీనమై నటించి సినిమాకు ప్లస్‌ అయ్యాడు. ఆ సినిమా, ముఖ్యంగా గోన గన్నారెడ్డి క్యారెక్టర్బన్నీకి మంచి పేరు తెచ్చి పెట్టింది.  వరుడు తీవ్రంగా నిరాశ పరిచినా గుణశేఖర్ అంటే  అతనికి గౌరవం ఉంది. ఈ క్రమంలోనే హిరణ్యకశ్యపలో ఓ పాత్ర కోసం గుణ.. అతడిని సంప్రదించారట. కానీ, ప్రస్తుతం బన్నీ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సుకుమార్తో ‘పుష్ప’ చేస్తున్న అల్లువారి హీరో కొరటాల శివతో  ఓ సినిమాకు ఓకే చెప్పాడు. వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో ‘ఐకాన్‌’ కూడా చేయాల్సి ఉంది. మరి, ఇంత బిజీ షెడ్యూల్‌లో తన క్లోజ్‌ ఫ్రెండ్‌ రానాతో కలిసి నటించేందుకు అతను ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఒకవేళ అతను ఓకే అంటే మాత్రం మరో  క్రేజీ కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరించడం పక్కా అనొచ్చు.
    Also Read : ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!