తొమ్మిదేళ్లకే రూ. 220 కోట్లు సంపాదించిన బుడ్డోడు.. ఎలా అంటే..?

మనలో చాలామందికి డబ్బు సంపాదించడం కల. ఎంత సంపాదించినా ఇంకా ఎక్కువ సంపాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా ఐదంకెల వేతనం సంపాదించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటే మరికొంతమంది మాత్రం తమ తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అమెరికాకు చెందిన 9 సంవత్సరాల బుడ్డోడు చిన్న వయస్సులోనే 220 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. Also Read: 9 నెలల తరువాత షాప్ తెరిచి షాకైన వ్యాపారి.. ఏం జరిగిందంటే..? యూట్యూబ్ […]

Written By: Navya, Updated On : December 21, 2020 5:57 pm
Follow us on


మనలో చాలామందికి డబ్బు సంపాదించడం కల. ఎంత సంపాదించినా ఇంకా ఎక్కువ సంపాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా ఐదంకెల వేతనం సంపాదించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటే మరికొంతమంది మాత్రం తమ తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అమెరికాకు చెందిన 9 సంవత్సరాల బుడ్డోడు చిన్న వయస్సులోనే 220 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు.

Also Read: 9 నెలల తరువాత షాప్ తెరిచి షాకైన వ్యాపారి.. ఏం జరిగిందంటే..?

యూట్యూబ్ ద్వారా ఏడాది కాలంలో 220 కోట్ల రూపాయలు ఈ బుడ్డోడి ఖాతాలో జమైంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే బొమ్మల గురించి రివ్యూలు చేస్తూ రయాన్ కాజీ అనే ఈ బాలుడు డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రజలు మెచ్చే కంటెంట్ ను అప్ లోడ్ చేస్తూ ఈ బుడ్డోడు ప్రస్తుతం పెద్ద పెద్ద యూట్యూబర్లను అధిగమించి ప్రప్రంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా వీడియోలు చేయడం రయాన్ ప్రత్యేకత.

Also Read: ఫేస్ బుక్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. లీకైన ఆ వివరాలు..?

చిన్న చదువులే చదువుకున్నా పెద్ద చదువులు చదివిన వాళ్లు జీవితకాలంలొ సంపాదించలేని మొత్తాన్ని ఈ బుడ్డోడు ఏడాది కాలంలో సంపాదిస్తున్నాడు. ఇతడి యూట్యూబ్ ఛానల్ కు 27 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే ఈ బుడ్డోడికి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో సులభంగా అర్థమవుతుంది. వీడియోల్లో రయాన్ అమాయకపు చూపులు, అల్లరి, రివ్యూ చెప్పే విధానం ఎక్కువ మందికి అతని నచ్చడానికి కారణమయ్యాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

కరోనా వైరస్ విజృంభణ, పలు దేశాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడం వల్ల ప్రజల్లో చాలామంది పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రయాన్ యూట్యూబ్ ఛానల్ కు 12 బిలియన్ వ్యూస్ వచ్చాయి. తక్కువ వీడియోలు చేసినా ప్రతి వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రయాన్ జాగ్రత్త పడతాడు.