https://oktelugu.com/

తిరుపతి సీటుపై పవన్ పట్టుబడుతారా?

ఏపీలో త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. టీడీపీ ఎంపీ దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. తిరుపతిలో ఇప్పటికే వైఎస్సాఆర్సీపీ.. టీడీపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఈ స్థానంలో పోటీచేసేందుకు బీజేపీ.. జనసేన పార్టీలు ఉవ్విళ్లురుతున్నాయి. దీంతో ఏ పార్టీకి సీటు దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 20, 2020 / 06:40 PM IST
    Follow us on

    ఏపీలో త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. టీడీపీ ఎంపీ దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.

    తిరుపతిలో ఇప్పటికే వైఎస్సాఆర్సీపీ.. టీడీపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఈ స్థానంలో పోటీచేసేందుకు బీజేపీ.. జనసేన పార్టీలు ఉవ్విళ్లురుతున్నాయి. దీంతో ఏ పార్టీకి సీటు దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది.

    ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి సపోర్టు చేసింది. దీంతో తిరుపతి సీటు జనసేనకే దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తిరుపతిలో బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.

    దీనిపై జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మాత్రం స్పందించలేదు. ఈక్రమంలోనే ఈనెల చివరి వారంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

    ఇటీవలే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారు. అయితే ఈసారి తిరుపతి సీటుపై తేల్చేందుకే ఢిల్లీ వెళ్లబోతున్నారని టాక్ విన్పిస్తోంది. ఈసారి పవన్ పర్యటనలో సోము వీర్రాజు.. బండి సంజయ్ కూడా వెళ్లబోతున్నారని సమాచారం.

    రెండు రాష్ట్రాల్లో బీజేపీతో జనసేన అడుగులు.. భవిష్యత్తు కార్యచరణ.. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ ఢిల్లీ పర్యటనపై మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. కాగా పవన్ కల్యాణ్ తిరుపతి సీటును సాధిస్తారా? లేదా అనేది ఆసక్తిని రేపుతోంది.