https://oktelugu.com/

కరోనా తగ్గినా కలవరమే.. 75 శాతం మందిలో ఈ లక్షణాలు!

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 70 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉంది. చాలామంది కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. బ్రిటన్ లో చేసిన అధ్యయనంలో కరోనా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత సైతం బాధితులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 20, 2020 5:08 pm
    Follow us on

    దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 70 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉంది. చాలామంది కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. బ్రిటన్ లో చేసిన అధ్యయనంలో కరోనా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    కరోనా నుంచి కోలుకున్న తర్వాత సైతం బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా వల్ల ఆస్పత్రుల్లో చేరిన వారిలో దాదాపు 75 శాతం మంది కోలుకున్న తరువాత ఆయాసం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తేలింది. 110 మంది కరోనా రోగులపై పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కోలుకున్న వారిలో కొందరు రోజువారీ పనులు చేసుకోవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారని అధ్యయనంలో తేలింది.

    వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడుతున్నాయని సమాచారం. బ్రిస్టల్‌లోని సౌత్‌మిడ్ హాస్పిటల్ డాక్టర్లు వైరస్ నుంచి కోలుకున్న కొంతమంది రోగుల్లో మచ్చలను గుర్తించారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయాసం, ఒళ్లు నొప్పుల సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కరోనా నుంచి కోలుకున్న తరువాత వచ్చే ఆరోగ్య సమస్యల కోసం చికిత్సను ప్రారంభించారు.