కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం

ముస్లిం మైనార్టీలను చేతబట్టి తెలంగాణలో రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్, ఎంఐఎంలను ఒకే దెబ్బతో కొట్టాలని కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ కు మంచి అవకాశం దొరికింది. దీంతో హైదరాబాద్ లో రాజకీయం మొదలెట్టేసింది. Also Read: సారూ… నోరిప్పండి! తెలంగాణ పాత సచివాలయం కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న మసీదును టీఆర్ఎస్ సర్కార్ కూల్చేసి కొత్త భవనం కడుతోంది. సచివాలయం పూర్తయ్యాక కొత్త మసీదును కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం.. దానికి ఆయన స్నేహితుడైన […]

Written By: NARESH, Updated On : August 20, 2020 5:09 pm
Follow us on


ముస్లిం మైనార్టీలను చేతబట్టి తెలంగాణలో రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్, ఎంఐఎంలను ఒకే దెబ్బతో కొట్టాలని కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ కు మంచి అవకాశం దొరికింది. దీంతో హైదరాబాద్ లో రాజకీయం మొదలెట్టేసింది.

Also Read: సారూ… నోరిప్పండి!

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న మసీదును టీఆర్ఎస్ సర్కార్ కూల్చేసి కొత్త భవనం కడుతోంది. సచివాలయం పూర్తయ్యాక కొత్త మసీదును కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం.. దానికి ఆయన స్నేహితుడైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సరేననడంతో రాజకీయం చల్లబడింది.

అయితే టీఆర్ఎస్, ఎంఐఎం కూడబలుక్కొని రాజీకొచ్చిన ఈ వ్యవహారాన్ని పాతబస్తీలోని కొన్ని ముస్లిం సంఘాలు, మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ.. మైనారిటీ వర్గానికి చెందిన నాయకులతో కీలక సమావేశం నిర్వహించి ముందుకు సాగాలని నిర్ణయించింది.

ప్రధానంగా ఈ ఇష్యూతో టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేలా.. ముస్లిం వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఈ ఆందోళనను చేపట్టడం ద్వారా కాంగ్రెస్.. టీఆర్ఎస్ ను వెనక్కినెట్టి.. ముస్లిం ఓటర్లను తిరిగి పొందవచ్చు. అదే సమయంలో ముస్లింల పార్టీ అయినా ఎంఐఎంను లక్ష్యంగా చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ స్కెచ్ గీసింది.

ఎందుకంటే మసీదు కూల్చివేతపై ఎంఐఎం మౌనంగా ఉంటూ కేసీఆర్ సర్కార్ కు మద్దతు ప్రకటించింది. అదే స్థలంలో మసీదును పునర్నిర్మిస్తామని కేసీఆర్ అన్న మాటకు కృతజ్ఞతలు తెలిపింది.

Also Read: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడురోజులేనా?

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం వ్యతిరేక మతాధికారుల సాయంతో ఈ ఆందోళనను ప్రారంభించడాలని చూస్తోంది. తద్వారా ఎంఐఎం ఓటు బ్యాంకును కూడా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఆశపడుతోంది.

అయితే ట్విస్ట్ ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముస్లిం నాయకులు ఎంఐఎంతో సాన్నిహితంగా ఉంటున్నారు. అందుకే కాంగ్రెస్ తీసుకునే ఏ స్టెప్ అయినా ఎంఐఎం అగ్రనేతలకు లీక్ అయిపోతున్నాయట.. మరి ఈ లీకేజీని అరికడితేనే కాంగ్రెస్ ప్లాన్లు వర్కవుట్ అవుతాయన్నమాట..