https://oktelugu.com/

గ్రేట్‌ యాక్టర్ కు కంగనా స్ట్రాంగ్‌ కౌంటర్

ఎలాంటి బ్యాక్ ‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో అడుగు పెట్టి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన నటి కంగనా రనౌత్‌. వైవిధ్యమైన చిత్రాలతో పాటు.. తన వ్యవహారశైలితోనూ తరచూ వివాదాల్లో నిలుస్తుందామె. తన ముందు అన్యాయం జరిగినా, తన జోలికి ఎవరు వచ్చిన అస్సలు సహించదామె. ఎదురుగా ఎంత పెద్దవాళ్లున్నా సరే కడిగిపారేయడం ఆమె నైజం. అందుకే బాలీవుడ్‌లో పైర్ బ్రాండ్‌గా నిలిచించి. ప్రతిభలోనూ ఓ మెట్టు ఎక్కువే. చూస్తుండగానే స్టార్ హీరోయిన్‌ అయిందామె. ఖాన్‌ త్రయంతో నటించను అని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 / 04:58 PM IST
    Follow us on


    ఎలాంటి బ్యాక్ ‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో అడుగు పెట్టి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన నటి కంగనా రనౌత్‌. వైవిధ్యమైన చిత్రాలతో పాటు.. తన వ్యవహారశైలితోనూ తరచూ వివాదాల్లో నిలుస్తుందామె. తన ముందు అన్యాయం జరిగినా, తన జోలికి ఎవరు వచ్చిన అస్సలు సహించదామె. ఎదురుగా ఎంత పెద్దవాళ్లున్నా సరే కడిగిపారేయడం ఆమె నైజం. అందుకే బాలీవుడ్‌లో పైర్ బ్రాండ్‌గా నిలిచించి. ప్రతిభలోనూ ఓ మెట్టు ఎక్కువే. చూస్తుండగానే స్టార్ హీరోయిన్‌ అయిందామె. ఖాన్‌ త్రయంతో నటించను అని చెప్పి బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గలేదు. నాయికా ప్రాధాన్యం ఉన్న కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ ‘క్వీన్‌’గా ఎదిగింది. తన నటనతో అందరినీ మెప్పించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా అందుకుంది. ఇక, హృతిక్ రోషన్‌తో చాన్నాళ్లు డేటింగ్‌ చేసిందామె. కానీ, అతను తనను మోసగించాడని బహిరంగంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా పబ్లిక్‌ గానే అతనిపై విమర్శలు గుప్పించింది. అయినా ప్రొఫెషనల్‌ పరంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోందామె.

    Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

    ఈ మధ్య కంగనా పేరెత్తగానే బాలీవుడ్‌లో చాలా మంది హడలిపోతున్నారు. మరికొందరు మండి పడుతున్నారు. కారణం.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై రనౌత్‌ నిర్భయంగా మాట్లాడడమే. అనేక అనుమానాలు కనిపిస్తున్నప్పటికీ అందరూ సుశాంత్‌ది ఆత్మహత్య అనగా కంగనా మాత్రం ఇది హత్యే అని గొంతెత్తింది. ఇది ప్రేరేపిత ఆత్మహత్య అని, బాలీవుడ్‌ బడా బాబుల బంధుప్రీతి కారణంగానే ఓ ప్రతిభావంతుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లాడని నినదించింది. సుశాంత్‌ మృతి విషయంలో తన ఆరోపణలు నిరూపించుకోకపోతే పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానని సవాల్‌ చేసింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేసింది. మరికొందరు కూడా ఇదే డిమాండ్‌తో సుప్రీంను ఆశ్రయించారు. దాంతో సుశాంత్‌ మృతి కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇది కంగనా సాధించిన నైతిక విజయం అనొచ్చు.

    Also Read: బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!

    అయితే, సుశాంత్‌ మృతి విషయంలో గొంతెత్తిన కంగనాపై బాలీవుడ్‌లో పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు నసీరుద్దీన్‌ షా సైతం రనౌత్‌పై కామెంట్లు చేశాడు. కంగనా లాంటి అర్ధజ్ఞానం ఉన్న వారి మాటలను పట్టించుకోవద్దని తీసిపారేశాడు. అంతేకాదు హిందీ చిత్రసీమలో అసలు బంధుప్రీతి అనేదే లేదన్నాడు. కేవలం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న వాళ్లే అలాంటి వాటిపై మాట్లాడుతున్నారని కంగనాను ఎద్దేవా చేశాడు. అసలే ఫైర్ బ్రాండ్‌ అయిన కంగనా.. నసీరుద్దీన్‌ మాటలను తనదైన శైలిలో తప్పికొట్టింది. ‘కృతజ్ఞతలు నసీర్ గారూ. ఇలాంటి మాటలు పడడం నాకు కొత్తేం కాదు. వాటికి నేను అలవాటు పడ్డా. కానీ, మీరు ఒక్క విషయం చెప్పండి. నా స్థానంలో ప్రకాశ్‌ పదుకోన్‌ కూతురో (దీపిక పదుకోన్‌), అనిల్‌ కపూర్ కూతురో (సోనమ్‌ కపూర్) ఉంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా?’ అని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. నసీరుద్దీన్‌ వయసుకు గౌరవం ఇస్తూనే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు పరోక్షంగా దీపిక, సోనమ్‌ కపూర్ ప్రస్తావన తెచ్చింది. వాళ్లిద్దరికీ మంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉండడంతో బాలీవుడ్‌లో బంధుప్రీతిపై కంగనా తనదైన స్టయిల్లో ప్రస్తావించింది. నసీరుద్దీన్‌ అంతటి గ్రేట్‌ యాక్టర్కే ఇలాంటి కౌంటర్ ఇవ్వడంతో దెబ్బకు కంగనా గురించి మాట్లాడాలంటే పలువురు వణికిపోతున్నారట. ఫైర్ బ్రాండ్ మజాకా!