https://oktelugu.com/

Balaiah Makeup Cast: బాలయ్య బాబు విగ్గు నా మజాకా? అంత ఖర్చు పెట్టారా?

Balaiah Makeup: బాలయ్య బాబా మజాకా.. నందమూరి అందగాడిని అంతే అందంగా చూపించడానికి దర్శకులు ఎంతో కష్టపడుతుంటారు. అయితే అందరిలోకి దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలే వేరు. బోయపాటి చూపించినంతగా తెరపై ఏ దర్శకుడు చూపించలేదట.. నిజానికి అగ్రహీరో బాలకృష్ణకు ఎప్పుడో జుట్టు ఊడిపోయింది. చాలా రోజులుగా దాన్ని విగ్గుతో కవర్ చేస్తున్నారు. సినిమాకో విగ్గు ఉంటుంది. ఏ దర్శకుడు ఎలా చూపించాలనుకుంటున్నారో అలానే కనిపిస్తుంది. Also Read: ‘అఖండ’ సినిమా పై అందరి మాట అదే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 / 04:21 PM IST
    Follow us on

    Balaiah Makeup: బాలయ్య బాబా మజాకా.. నందమూరి అందగాడిని అంతే అందంగా చూపించడానికి దర్శకులు ఎంతో కష్టపడుతుంటారు. అయితే అందరిలోకి దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలే వేరు. బోయపాటి చూపించినంతగా తెరపై ఏ దర్శకుడు చూపించలేదట..

    Balakrishna-in-Ruler

    నిజానికి అగ్రహీరో బాలకృష్ణకు ఎప్పుడో జుట్టు ఊడిపోయింది. చాలా రోజులుగా దాన్ని విగ్గుతో కవర్ చేస్తున్నారు. సినిమాకో విగ్గు ఉంటుంది. ఏ దర్శకుడు ఎలా చూపించాలనుకుంటున్నారో అలానే కనిపిస్తుంది.

    Also Read: ‘అఖండ’ సినిమా పై అందరి మాట అదే !

    అయితే బోయపాటి తీసిన ‘సింహా’, లెజెండ్ సినిమాల్లో బాలయ్య ఎంతో అందంగా పవర్ ఫుల్ గా అచ్చు గుద్దినట్టు సరిపోయేలా ఉన్నారు. ఇక అఖండ మూవీలో ‘మురళీకృష్ణ’ పాత్రకు కూడా సరిగ్గా ఆ విగ్ సరిపోయిందట.. ఏంటీ ఆ రహస్యం అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడిందట..

    ‘అఖండ’ మూవీలో బాలయ్య వాడిన విగ్గుల ధర రూ.50 లక్షలు అట.. మురళీకృష్ణగా బాలయ్య వాడిన విగ్గు ధర రూ.13 లక్షలు. అలాంటివి మూడు సినిమాలో వాడరట.. ఇక ఈ విగ్గులను మేనేజ్ చేయడానికి ముంబై నుంచి ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ ను తీసుకొచ్చాడు. అతడికి దాదాపు 12 లక్షలు. ఇలా విగ్గుల కోసమే రూ.50లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందట.. బాలయ్య విగ్గునా మజాకానా?

    Also Read: 100 కోట్లు మార్క్ దిశగా పరుగులు తీస్తున్న బాలయ్య “అఖండ”…