Tollywood Drugs Case: టాలీవుడ్‌కు డ్రగ్స్ మరక పూర్తిగా తొలగిపోయినట్లయింది. ఇప్పటి వరకూ ఆయా తారలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఓ వైపు తెలంగాణ పోలీసులు ఆధారాల్లేవని కోర్టుకు తేల్చి చెబితే… అనూహ్యంగా మధ్యలో విచారణ ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని… తమ కేసును కూడా క్లోజ్ చేస్తోంది. దీంతో నాలుగేళ్లకుపైగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలకు రిలీఫ్ లభించినట్లయింది.
2017లో అరవై మందికి పైగా టాలీవుడ్ ప్రముఖులను పోలీసులు డ్రగ్స్ కేసులో విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్ వాడారో లేదో తేల్చేస్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని బృందం ప్రకటించింది. కానీ తర్వాత సైలెంటయ్యారు. మళ్ళీ తాజాగా 2020 సెప్టెంబర్ వరకూ చార్జిషీట్లు దాఖలు చేయలేదు. వివిధ డ్రగ్స్ కేసులలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా చెప్పారు కానీ సినీ ప్రముఖుల పేర్లు బయట పెట్టలేదు. దీంతో వారందరికీ అప్పట్లో క్లీన్ చిట్ ఇచ్చనట్లుగా స్పష్టమయింది.
Also Read: సినిమా రంగం కష్టానికి కారణం.. ఈ సినిమా పిచ్చోళ్లే !
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం సంచలనం సృష్టించింది. గత ఆగస్టులో గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్ , చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఓ వైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తూండాగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులు తేల్చేశారు. దీంతో ఈడీకి కూడా ఏం చేయాలన్నదానిపై క్లూ లేకుండా పోయింది. దీంతో టాలీవుడ్‌కు డ్రగ్స్ కేసు టెన్షన్ పోయినట్లే అని అర్దం అవుతుంది.
Also Read: ఏంటండీ ? డైలాగ్స్ లో పాత వాసన కొడుతుంది ?