https://oktelugu.com/

Painless death in one minute: నిముషంలో నొప్పి తెలియ‌కుండా చంపేసే మెషిన్‌.. దీని గురించి తెలిస్తే..

Painless death in one minute: మానవ జీవితంలో కొన్ని సార్లు ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అటువంటి అరుదైన సందర్భాలు మనం చాలా సార్లు చూడొచ్చు. ఆ టైంలో బతికి ఉండటం కంటే కూడా ప్రాణాలు తీసుకోవడమే మంచిదనే అభిప్రాయం ఏర్పడుతుంది. అలా బతికుండటం ఇష్టం లేదని, తమకు చనిపోవడానికి అనుమతించాలని చాలా మంది చట్టపరమైన అనుమతులు తీసుకుంటారు కూడా. అయితే, అలా అనుమతి తీసుకున్నప్పటికీ మరణం అంత ఈజీగా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే నిమిషాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2021 / 03:54 PM IST
    Follow us on

    Painless death in one minute: మానవ జీవితంలో కొన్ని సార్లు ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అటువంటి అరుదైన సందర్భాలు మనం చాలా సార్లు చూడొచ్చు. ఆ టైంలో బతికి ఉండటం కంటే కూడా ప్రాణాలు తీసుకోవడమే మంచిదనే అభిప్రాయం ఏర్పడుతుంది. అలా బతికుండటం ఇష్టం లేదని, తమకు చనిపోవడానికి అనుమతించాలని చాలా మంది చట్టపరమైన అనుమతులు తీసుకుంటారు కూడా. అయితే, అలా అనుమతి తీసుకున్నప్పటికీ మరణం అంత ఈజీగా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే నిమిషాల వ్యవధిలోనే మనుషులు చనిపోయేలా ఓ మెషిన్‌ను తయారు చేశారు. ఆ మెషిన్ ప్రత్యేకతలపై స్పెషల్ ఫోకస్..

    Painless death in one minute

    ఇక నయం కాని డిసీజెస్‌తో తీవ్రమైన బాధ పడుతూ నరకం అనుభవించే వారు తమను చనిపోవడానికి అనుమతించాలని కోర్టులను కోరుతుంటారు. అలా ప్రాణాలు తీసుకోవడాన్ని యూథనేష్యా అని పిలుస్తుంటారు. అయితే, ఇలా బాధల నుంచి విముక్తి పొందడానికి అమలు చేసే మెర్సీ కిల్లింగ్ చట్ట విరుద్ధం. కానీ, వారి కోరికను అంగీకరిస్తూ న్యాయస్థానాలు కొన్ని చోట్ల అనుమతులూ ఇస్తున్నాయి. స్విట్జర్లాండ్ దేశం ఇలా చనిపోవడానికి అనుమతులివ్వడాన్ని చట్ట బద్ధం చేసింది. ఈ క్రమంలోనే నొప్పి లేకుండా చనిపోవడానికి తయారు చేయబడిన ఈ మెషిన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెషిన్ శవపేటిక షేప్‌లో ఉంటుంది.

    ఇందులోని క్యాప్సుల్ ఒకే ఒక నిమిషంలో నొప్పి లేకుండా మీ ప్రాణాలు తీసేస్తుంది. ఈ సూసైడ్ మెషిన్‌ను డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే రూపొందించారు. ఈ మెషిన్ తయరీలో ఆయనదే కీలక పాత్ర. కాగా, నిట్ష్కే ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గ‌నైజేషన్‌కు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్విట్జర్లాండ్ కంట్రీలో మెర్సీ కిల్లింగ్ చట్టబద్ధం అయింది. ఈ క్రమంలోనే సుమారు 1,300 మంది మెర్సీ కిల్లింగ్‌ను ఉపయోగించుకున్నారు.

    ఈ సూసైడ్ మెషిన్ పేరు ‘సార్కో’. ఇది కణజాల స్థాయిలో ఆక్సిజన్, బ్లడ్‌లోని కార్బన్ డై యాక్సైడ్ సప్లై తగ్గించేసి మనుషులను చంపేస్తుంది. ఇకపోతే ఈ మెషిన్‌లోకి వెళ్లిన పర్సన్ రెప్పపాటు కదలికలతో క్లిష్టమైన స్థాయికి వెళ్తాడు. అలా క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు. ఈ మెషిన్‌లోకి ఎలాంటి వ్యక్తులైనా ప్రవేశించొచ్చు. కనురెప్పలు తప్ప మిగతా శరీర భాగాలేవీ పని చేయని వ్యక్తులు కూడా ఈ మెషిన్‌లోకి ఎంటర్ అయి తమ ప్రాణాలు కోల్పోవచ్చు.

    నిమిషాల వ్యవధిలో ఎలాంటి నొప్పిలేకుండా వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోవచ్చు. రోగాల బాధ కంటే చావే మేలు అనుకునే వారు తగు అనుమతులు తీసుకుని ఈ మెషిన్‌లోకి వెళ్లి ప్రాణాలను తీసేసుకోవచ్చు. సూసైడ్ మెషిన్‌గా పిలవబడే ఈ ‘సార్కో’ మెషిన్..చాలా సున్నితంగా ప్రాణాలు తీసేస్తుంది. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండానే.. కనీసంగా సూది కూడా పొడవకుండానే ప్రణాలు తీసేయగలదు. స్విట్జర్లాండ్‌లో ఈ సూసైడ్ మెషిన్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రశాంతమైన మరణాన్ని అందించే ఈ యంత్రాన్ని తయారు చేసిన వారికి పలువురు థాంక్స్ కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

    Tags