Waltair Veerayya Records: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.మెగాస్టార్ కెరీర్ లో మాత్రమే కాదు, ఈ సినిమా టాలీవుడ్ లోనే ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.ఇప్పటికే కలెక్షన్స్ పరంగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అడుగు దూరం లో ఉన్న ఈ సినిమా, ఇప్పుడు 50 రోజుల సెంటర్స్ విషయం లో కూడా సరికొత్త రికార్డు ని నెలకొల్పబోతుంది.
ఓటీటీ కాలం లో ఒక సినిమా రెండు వారాలు సరిగ్గా ఆడడమే గగనం అయిపోతున్న ఈరోజుల్లో, అత్యధిక సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు.కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం లోనే ఈ సినిమా 27 డైరెక్ట్ కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందట.
రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమాకి కూడా అన్ని సెంటర్స్ లో 50 రోజుల రన్ రాలేదు..అంతే కాకుండా నైజాం లో కూడా ఈ చిత్రానికి సుమారుగా 60 థియేటర్స్ లో అర్థ శత దినోత్సవం జరుపుకోబోతుంది.అలా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం కలిపి ఈ సినిమా దాదాపుగా 250 కేంద్రాలలో అర్థశత దినోత్సవం ని జరుపుకోబోతుందట.గడిచిన కొద్దీ సంవత్సరాలలో ఇలాంటి రన్ ఏ సినిమాకి కూడా రాలేదనే చెప్పొచ్చు.ఇప్పటికీ వీకెండ్స్ వచ్చిందంటే చాలు ఫ్యామిలి ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కట్టేస్తున్నారు.
బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి ప్రభంజనం ని సృష్టించిన ఈ సినిమా ఈ నెల 27 వ తారీఖు నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.ఓటీటీ విడుదల తేదీ ప్రకటించేసింది తర్వాత కూడా ఈ సినిమాకి ఇంకా కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయంటే మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.