
Nijam With Smitha Chiranjeevi Episode: ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈమధ్య టాక్ షోస్ ట్రెండ్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది.మన టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కి తెరలేపింది మాత్రం ఆహానే..ముందుగా సమంత తో ‘సామ్ జామ్’ అనే టాక్ షో తో ప్రారంభం అయ్యింది, ఆ తర్వాత ఏకంగా నందమూరి బాలకృష్ణ తో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో సెన్సేషనల్ హిట్ అవ్వడం తో ఇక అన్ని ఓటీటీ యాప్ లు ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వడం ప్రారంభించాయి.
‘అన్ స్టాపబుల్’ షో రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది.ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ పాప్ సింగర్ స్మిత తో సోనీ లివ్ యాప్ వారు ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షో ని ఇటీవలే ప్రారంభించారు.మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఈ ఎపిసోడ్ కి అపూర్వమైన స్పందన లభించింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ కి దాదాపుగా ఇప్పటి వరకు వంద మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది.అంతే కాదు ఈ ఎపిసోడ్ వల్ల సోనీ లివ్ యాప్ ని వినియోగించుకునేవాళ్ళు కూడా లక్షల సంఖ్య లో పెరిగారు.నిన్న మొన్నటి వరకు మన టాలీవుడ్ ఆడియన్స్ బాగా వాడే అప్లికేషన్స్ ‘డిస్నీ + హాట్ స్టార్’, ‘అమెజాన్ ప్రైమ్’, ‘నెట్ ఫ్లిక్స్’ మరియు రీసెంట్ గా ‘ఆహా’.ఈ యాప్స్ నే అధికంగా వినియోగించేవాళ్ళు.ఇప్పుడు వాళ్ళతో పోటీ పడడానికి ‘నిజం విత్ స్మిత’ టాక్ షోని ఉపయోగించుకోనున్నారు.మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి రాగ, రెండవ ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నాడు.

ఇక ఆ తర్వాత నాని , అల్లరి నరేష్ మరియు సాయి పల్లవి వంటి స్టార్ సెలబ్రిటీస్ తో కూడా షూటింగ్ చేసారు.మరో సెన్సేషనల్ న్యూస్ ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ టాక్ షో కి హాజరవుతానని మాట ఇచ్చినట్టు ఇటీవలే స్మిత తెలిపింది.ఈ ఒక్కటి చాలదా సోనీ లివ్ సంస్థ మిగిలిన ఓటీటీ చానెల్స్ తో పోటీపడడానికి అని విశ్లేషకులు చెప్తున్నారు.చూడాలి మరి ఈ టాక్ షో కూడా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ లాగ క్లిక్ అవుతుందో లేదో అనేది.