Ram Charan Instagram Post: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మామూలు రేంజ్ లో లేదు.మగధీర సినిమా టైం నుండే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు #RRR సినిమాతో బాలీవుడ్ ఫేవరెట్ హీరో గా మారిపోయాడు.ఎక్కడ చూసినా ఇప్పుడు రామ్ చరణ్ మేనియా నే కనిపిస్తుంది.రీసెంట్ గా ఆయన బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తో కలిసి ‘మెయిన్ ఖిలాడీ’ అనే అక్షయ్ కుమార్ సాంగ్ కి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియా ని తెగ ఊపేస్తోంది.
రామ్ చరణ్ అంటేనే గ్రేస్, అలాంటిది ఈ సాంగ్ లో ‘గణేష్ ఆచార్య’ లాంటి డ్యాన్స్ మాస్టర్ ని కూడా డామినేట్ చేసేయడం అనేది మామూలు విషయం కాదు.తన పాటకి రామ్ చరణ్ వేసిన స్టెప్పులని చూసి ఫిదా అయినా అక్షయ్ కుమార్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో రామ్ చరణ్ ని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో పెట్టాడు.
అంతే కాకుండా బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం రామ్ చరణ్ డ్యాన్స్ ని పొగడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.ఇప్పటికే నాటు నాటు సాంగ్ తో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రపంచం మొత్తాన్ని డ్యాన్స్ వేయించి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ దాకా తీసుకెళ్లిన రామ్ చరణ్, ఇప్పుడు సరికొత్త ఇంస్టాగ్రామ్ రీల్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యాడు.
ఆయన తదుపరి చిత్రం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో అనే విషయం మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతుంది కాబట్టి రామ్ చరణ్ బాలీవుడ్ మార్కెట్ లో స్థిరమైన సాలిడ్ మార్కెట్ ని ఏర్పర్చుకోబోతున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.చూడాలిమరి రాబొయ్యే రోజుల్లో ఆయన క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలా ఉండబోతుందో.
https://www.youtube.com/watch?v=X9gL-9WtrRQ&t=9s