Marriages: దేవ్యాప్తంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 42 లక్షలకుపైగా వివాహాలు జరుగుతాయని ఒక అంచనా. దేశరాజధాని ఢిల్లీలోనే 4 లక్షలకుపైగా వివాహాలు జరుగుతాయంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. సుమారుగా రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాల కొనుగోలు, పెళ్లిళ్ల భోజనాలకు సంబంధించిన భారీగా డిమాండ్ ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ నిత్యావసర సరుకులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
జూలై వరకు వివాహాలు..
ఈ సీజన్‌లో పెళ్లిళ్ల సీజన్ జూలై 15 వరకు ఉంది. ఈ సీజన్‌లో 42 లక్షల పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రూ.5.5 లక్షల కోట్ల వరకు మార్కెట్‌లో కొనుగోళ్లు జరుగుతాయని ట్రేడర్స్ బాడీ క్యాచ్ చీఫ్ ఆఫీసర్ సుమిత్ అగర్వాల్ తెలిపారు. వివాహ సంబంధిత వస్తువుల కొనుగోళ్ల ద్వారా భారీగా నగదు మార్కెట్‌లోకి వస్తుందని తెలిపారు.
ప్రధాని విజ్ఞప్తితో..
డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను విదేశాల్లో కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీని ప్రభావం కూడా మార్కెట్‌కు సానుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగే వేదికలు జూలై వరకు బుక్ అయ్యాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 14న ముగిసిన సీజన్‌లో 35 లక్షల వరకు పెళ్లిళ్లు జరిగాయి. రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ లో బిజినెస్ రూ.1.25 కోట్లు అదనంగా జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.