https://oktelugu.com/

Car Loan: లోన్ ద్వారా కారు కొంటున్నారా? ఈ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు..

లోన్ ద్వారా కారు కొనుగోలు చేయాలంటే ఏ బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ వస్తుందో తెలియక తికమకపడుతూ ఉంటారు. ఈ తరుణంలో బెస్ట్ ఆప్షన్ ఏదో ఇప్పుడు మీకు చెబుతాం..

Written By:
  • Srinivas
  • , Updated On : February 28, 2024 / 03:32 PM IST

    Car Loan

    Follow us on

    Car Loan: నేటి కాలంలో అవసరాలు పెరిగిపోతున్నాయి. కుటుంబమంతా కలిసి ప్రయాణాలు చేయాలంటే ప్రత్యేకంగా వెహికల్ ఉండాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌకర్యంగా ఉండే 4 వీలర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న కారు కాకుండా 7 సీటర్ లేదా ఎస్ యూవీ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఈ కార్లు మిడిల్ క్లాస్ పీపుల్స్ బడ్జెట్ కు ఎక్కువగానే ఉంటుంది. దీంతో చాలా మంది రుణం ద్వారా కారు కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే లోన్ ద్వారా కారు కొనుగోలు చేయాలంటే ఏ బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ వస్తుందో తెలియక తికమకపడుతూ ఉంటారు. ఈ తరుణంలో బెస్ట్ ఆప్షన్ ఏదో ఇప్పుడు మీకు చెబుతాం..

    డబ్బు సేవింగ్ చేసి కారు కొనుగోలు చేయాలని కొందరు అనుకుంటారు. కానీ అలా చాలా రోజులు పడుతుంది. ఆ తరువాత కారులో వెళ్లే అనుభూతి ఉండదు. దీంతో లోన్ ద్వారా కారు కొనుగోలు చేయడం ద్వారా ఓ వైపు అవసరాలు తీర్చుకుంటూనే మరోవైపు లోన్ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగస్తులు ఎక్కవగా లోన్ ద్వారా కారు కొనుగోలు చేయాలని అనుకుంటారు. రుణ సాయం ద్వారా కారు కొనాలనుకునేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ని ఎంచుకోవడం బెటర్.

    రూ.10 లక్షల లోన్ ను ఒక సంవత్సరం పాటు తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. వడ్డీ రేటు 8.60 శాతం ఉంటుంది. ఈఎంఐని రూ.87,266 చెల్లించాలి. ఇదే రుణాన్ని 5 సంవత్సరాలకు తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. వడ్డీ రేటు అలాగే ఉంటుంది. ఈఎంఐని రూ.20,565 చెల్లించాల్సి ఉంటుంది.

    ఎస్బీఐ బ్యాంకు ద్వారా కారు కోసం రూ. 5 లక్షలు లోన్ ను ఒక సంవత్సరం పాటు తీసుకుంటే.. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే వడ్డీ రేటు 8.60 వడ్డీ రేటు ఉంటుంది. వీరు నెల నెలా ఈఎంఐ రూ.43,633 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లకు లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. వడ్డీ రేటు 8.60 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఈఎంఐ మాత్రం 10,282 చెల్లించాలి. ఒక లక్ష రూపాయలను ఐదేళ్ల పాటు తీసుకుంటే రూ.2,095 ఈఎంఐ చెల్లించాలి. దీనికి కూడా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 8.60 వడ్డీ రేటును నిర్ణయిస్తారు.