ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు ఉండేవి. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు కూడ కార్లలో తిరిగే సౌకర్యాన్ని కల్పించాయి. తక్కువ బడ్జెట్ లో కొన్ని మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. లో బడ్జెట్ కార్లంటే ఎక్కువగా హ్యాచ్ బ్యాక్ కార్ల గురించి చెప్పుకోవచ్చు. చిన్న ఫ్యామిలీకి ఈ కారు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజలకు చేరువలో ధర ఉంటాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన హ్యాచ్ బ్యాక్ కార్ల గురించి తెలుసుకుందాం..
కార్ల కంపెనీల్లో మారుతి ముందంజలో ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ కార్లు ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ కూడా ఇదే. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన బాలెనో బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కారుగా నిలుస్తుంది. ఇది 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 90 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.6.66 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.9.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మారుతి కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ కూడా మంచి హ్యాచ్ బ్యాక్ కారు అనుకోవచ్చు. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 89 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. దీనిని రూ.6.44 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు.
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 ఇటీవల బాగా పాపులర్ అయింది. పెట్రోల్ ఫ్యూయెల్ కలిగిన ఈ కారు లీటర్ పెట్రోల్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది 118 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగిన ఇది రూ.7.07 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన ఐ 10 నియోస్ గత ఏడాదిలో అమ్మకాల జోరందుకుంది. అతి తక్కువ ధరలో కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిని రూ.4.77 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి కంపెనీకి టాటా గట్టి పోటీ ఇస్తోంది. వివిధ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన ఈ కంపెనీ పలు హ్యాచ్ బ్యాక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిలో టియాగో బెస్ట్ హ్యాచ్ బ్యాక్ గా నిలుస్తుంది. ఈ కారు రూ.6.95 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో 1199 సీసీ ఇంజిన్, 84 బీహెచ్ పీ పవర్ తో పాటు 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.