Bangalore: కన్నతల్లి చేసిన దారుణాన్ని బయటపెట్టాడు పదేళ్ల కొడుకు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నగరం కరేనాహళ్లి ప్రాంతానికి చెందిన శైలజ (30), ఎన్.రాఘవేంద్ర (40) దంపతులు. డిసెంబర్ 27న రాఘవేంద్ర అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఫిట్స్ వచ్చి చనిపోయినట్టు శైలజ అందరినీ నమ్మించింది. అదే నిజమని నమ్మి రాఘవేంద్రకు అంత్యక్రియలు జరిపారు కుటుంబ సభ్యులు. అయితే, తన అన్న మృతిపై అనుమానాలున్నాయని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రత్యక్ష సాక్షి అసలు విషయం చెప్పాడు. ఇంతకూ ఆ ప్రత్యక్షి ఎవరో కాదు మృతుడి కొడుకు..
బాలుడి కళ్ల ముందే మృతుడి భార్య, ఆమె ప్రియుడు, అత్త కలిసి హతమార్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలుడు చెప్పింది నిజమని పోలీసులు నిర్దారణకు వచ్చారు. వివరాల్లోకివెళితే.. చేనేత దుకాణంలో పనిచేసే హనుమంతకు, గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే శైలజకు పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి బాగోతం శైలజ భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన శైలజ ప్రియుడు, తల్లితో కలిసి కొట్టి చంపేసింది.
Also Read: ఏళ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తి.. టీకా వేయగానే ఒంట్లో కదలికలు, మాటలు..!
అదే రోజు రాత్రి మరిది చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి కింద పడిపోగా, తలకు గాయమై మీ అన్న చనిపోయాడని నమ్మించింది.డిసెంబర్ 27న రాఘవేంద్ర చనిపోగా 29న అన్న కొడుకు చెప్పిన వివరాల మేరకు చంద్రశేఖర్ సీసీ టీవీ పరిశీలించగా రాత్రి 10.45 నిమిషాలకు ఓ వ్యక్తి రాఘవేంద్ర ఇంట్లోకి వెళ్లినట్లు రికార్డయింది. ఈ విషయాన్ని బాలుడి బాబాయ్ పోలీసులకు చెప్పగా.. వారు బాలుడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మృతుడి కొడుకు మాట్లాడుతూ.. తాను రాత్రి పడుకున్నప్పుడు ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడని ఏదో శబ్దం వినిపించగా లేచి చూసేసరికి మా అమ్మమ్మ నాన్న రెండు కాళ్లను గట్టిగా పట్టుకోగా, మా అమ్మ నాన్నపై కూర్చుని ఉందని, ఆ వ్యక్తి చపాతీ కర్రతో నాన్న తలపై బలంగా కొట్టాడని చెప్పాడు. ఎందుకు నాన్నను కొడుతున్నారని అడిగితే నన్ను కొట్టారని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడని రాఘవేంద్ర కుమారుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Also Read: ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!