Homeట్రెండింగ్ న్యూస్Marry Himself : పిచ్చికి పరాకాష్ట: తనను తానే పెళ్ళిచేసుకుని మళ్లీ 24 గంటల్లో అవి...

Marry Himself : పిచ్చికి పరాకాష్ట: తనను తానే పెళ్ళిచేసుకుని మళ్లీ 24 గంటల్లో అవి కావాలట…

Marry Himself : పిచ్చి ముదిరింది.  తలకి రోకలి చుట్టండి అన్నాడట వెనుకటికి ఒకడు.  ఈ సామెత తీరుగానే ఉంది ఈ యువతి వ్యవహార శైలి. తనకు నచ్చినవాడు ఎవరూ దొరకనట్టు, అసలు ఈ భూమ్మీ మీద పురుషుడు అనే వాడు లేనట్టు తనకు తానే వివాహం చేసుకుంది. అది గడిచి 24 గంటలు కాకముందే తన స్వీయ సాంగత్యంలో సుఖం లేదని గ్రహించి, ఇప్పుడు విడాకులు కావాలని కోరుకుంటున్నది. ఇప్పుడు ఆ యువతి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
25 ఏళ్ల యువతి యువకులు ఎలా ఉంటారు? మరీ ముఖ్యంగా వెస్ట్రన్ దేశాల్లో ఎలా ఉంటారు? ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. కానీ ఈ సో ఫీ మౌర్ పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్. ఎవరికీ కొరుకుడు పడదు. అందుకే ఈ పురుష పుంగవుడికి పడలేదు. తెల్లగా, సాలిడ్ గా ఉండటంతో ఎంతో “మగ”నుభావులు “నాన్ ఉన్నయ్ కాదలిక్కిరేన్” అన్నప్పటికీ నో చెప్పింది. ఈ అమ్మడి ప్లాస్త్ బ్యాక్ ఏంటో తెలుసుకుందామంటే మన దేశం కాదు కాబట్టి మాకు తెలియలేదు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఈ యువతి ఫిబ్రవరి లో అందరికీ షాక్ ఇచ్చింది. అది కూడా మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో.. తెల్లటి గౌన్, నెత్తి మీద కిరీటం తో ధగధగ మెరిసిపోయింది. ఎవరో ఆ అదృష్టవంతుడు అని నెటిజన్లు అనుకుంటుండగా.. “సోలో” కబురు చల్లగా చెప్పింది. ” నెటిజన్ మహాశయులారా…నేను సింగిల్ కాదు. మింగిల్ అయ్యాను. నన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఈ పాడు లోకంలో నన్ను ఎవరూ ఆకర్షించలేదు” అని అర్థం వచ్చేలా రాసుకొచ్చింది. ” ఈ రోజు నా జీవితంలో అదృష్టమైన క్షణాల్లో ఒకటి. నేను వివాహ దుస్తులు కొనుగోలు చేశాను. నన్ను నేను వివాహం చేసుకునేందుకు కేక్ కూడా తయారు చేసుకున్నాను” అని ఫిబ్రవరి 20 న ట్వీట్ చేసింది. అంతే కాదు కోసిన కేక్ ముక్కను( వెస్ట్రన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత కేక్ కట్ చేస్తారు) దీనికి సాక్ష్యంగా పెట్టింది. దీంతో హతాశులవడం నెటిజన్ల వంతు అయింది.
ఇక ఈ షాక్ నుంచి కోలుకోక ముందే ” నాకు ఈ సోలో జీవితం నచ్చడం లేదు. నాకు ఇప్పుడు విడాకులు కావాలి” అని అడుగుతోంది. అది కూడా ట్విట్టర్ వేదికగా.. ఈ ఒంటి ఖాయానికి ఇంకో తోడు కావాలనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ” మీరు మీ స్వీయ ప్రేమలో అందాన్ని పొందలేరు. మీకు ఒక తోడు కావాలి” అని ఒకరు చెప్పారు. “మీరు స్వీయ ప్రేమ కోసం పడిన తాపత్రయం మాకు నచ్చింది” అని కొందరు వ్యాఖ్యానించారు. ఇక ఇదే తరహాలో గుజరాత్ కు చెందిన క్షమా బిందు అనే 24 ఏళ్ల యువతి కూడా తనను తాను వివాహం(సోలో గమి) చేసుకుంది. ఈ వ్యవహారం అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు సోఫీ మౌర్ కూడా సోలో వివాహం చేసుకుని వార్తల్లో వ్యక్తి అయింది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular