2022 Nandamuri year : ‘నందమూరి’ నామ సంవత్సరంగా మారిన 2022 ..పట్టిందల్లా బంగారమే

2022 Nandamuri year : ఈ ఏడాది మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోలు ఎవరూ అంటే అది నందమూరి హీరోలే అని చెప్పొచ్చు..అఖండ సినిమాతో ప్రారంభమైన ఈ జైత్ర యాత్ర ఆ తర్వాత #RRR మరియు కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’ వరకు కొనసాగింది..కరోనా భయం తో థియేటర్స్ కి రావడం బాగా తగ్గించేసిన ప్రేక్షకులను చూసి ఇండస్ట్రీ మొత్తం ఢీలా పడింది..అలాంటి సమయం లో వచ్చిన అఖండ సినిమా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి […]

Written By: NARESH, Updated On : January 1, 2023 9:15 am
Follow us on

2022 Nandamuri year : ఈ ఏడాది మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోలు ఎవరూ అంటే అది నందమూరి హీరోలే అని చెప్పొచ్చు..అఖండ సినిమాతో ప్రారంభమైన ఈ జైత్ర యాత్ర ఆ తర్వాత #RRR మరియు కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’ వరకు కొనసాగింది..కరోనా భయం తో థియేటర్స్ కి రావడం బాగా తగ్గించేసిన ప్రేక్షకులను చూసి ఇండస్ట్రీ మొత్తం ఢీలా పడింది..అలాంటి సమయం లో వచ్చిన అఖండ సినిమా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పూర్వ వైభవం తెచ్చిపెట్టింది.

టికెట్ రేట్స్ అతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా దాదాపుగా 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..బాలయ్య నుండి ఇక కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే సినిమాని అయినా చూస్తామా అని ఢీలా పడిన నందమూరి అభిమానులకు ఈ చిత్రం ఏకంగా 75 కోట్లు వసూలు చెయ్యడంతో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఇక నందమూరి అభిమానుల ఉత్సాహం ని వంద రేట్లు రెట్టింపు చేస్తూ #RRR సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు..

ఇక ఆ తర్వాత చాలా కాలం నుండి హిట్స్ లేక డీలాపడిన కళ్యాణ్ రామ్ కి కూడా ఈ ఏడాది బాగా కలిసొచ్చింది..తన మార్కెట్ కి మించి ఖర్చు చేసి ‘బింబిసారా’ చిత్రాన్ని తీసాడు. ఇది కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..పది కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం ద్వారా ఏకంగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కెట్ వచ్చింది..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది అనే చెప్పొచ్చు..అలా నందమూరి హీరోలు ఈ ఏడాది పట్టిందల్లా బంగారం లాగా మారి నందమూరి నామ సంవత్సరం గా నిలిచింది.