క్లాసులు వింటూ 25 కోట్లు సంపాదించిన విద్యార్థిని..?

క్లాసులు వింటే డబ్బులు సంపాదించడం ఏమిటి…? ఎక్కడైనా క్లాసులు వింటే డబ్బులు ఇస్తారా…? అని అనుకుంటున్నారా…? అయితే ఒక విద్యార్థిని తరగతి గదిలో పాఠాలు వింటూ ఏకంగా 25 కోట్ల రూపాయలు సంపాదించింది. క్లాసులో పాఠాలు వినే సమయంలో 25 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువతికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అయితే అన్ని కోట్లు సొంతమైనా ఆ యువతి క్లాస్ రూమ్ లో ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోయింది. పూర్తి […]

Written By: Navya, Updated On : August 26, 2020 6:46 pm
Follow us on

క్లాసులు వింటే డబ్బులు సంపాదించడం ఏమిటి…? ఎక్కడైనా క్లాసులు వింటే డబ్బులు ఇస్తారా…? అని అనుకుంటున్నారా…? అయితే ఒక విద్యార్థిని తరగతి గదిలో పాఠాలు వింటూ ఏకంగా 25 కోట్ల రూపాయలు సంపాదించింది. క్లాసులో పాఠాలు వినే సమయంలో 25 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువతికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అయితే అన్ని కోట్లు సొంతమైనా ఆ యువతి క్లాస్ రూమ్ లో ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని పాఠాలు వినే సమయంలో ఈ మెయిల్ చెక్ చేసుకోగా 3.4 మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకున్నట్టు మెయిల్ వచ్చింది. దీంతో మనసులో నుంచి పట్టరాని ఆనందం పొంగుకొస్తున్నా క్లాసుకు భంగం కలగకూడదని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. మన దేశ కరెన్సీ ప్రకారం సదరు యువతి ఏకంగా 25,27,47,500 రూపాయలు గెలుచుకుంది.

క్లాస్ అయిపోయిన్ వెంటనే పట్టరాని ఆనందంతో యువతి తన స్నేహితులకు అసలు విషయం చెప్పేసింది. సెట్ ఫర్ లైఫ్ లాటరీని గెలుచుకున్న యువతి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదృష్టవంతురాలైన యువతి గెలుచుకున్న డబ్బుతో ఏం చేస్తావని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ డబ్బుతో రెండు ఇళ్లు కొంటానని ఒక ఇల్లు తన తల్లికి బహుమతిగా ఇచ్చి మరో ఇంట్లో తాను నివాసం ఉంటానని చెప్పింది. తనకు ఇతర దేశాలకు వెళ్లడం చాలా ఇష్టమని మిగిలిన డబ్బుతో విదేశాలను ఒక రౌండ్ వేసి వస్తానని యువతి చెబుతోంది.