‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !

క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని కథలను కాపీ కొడితే దరిద్రంగా ఉంటుంది. ఏ హాలీవుడ్ సినిమా నుండో.. ఏ నవల నుండో కాపీ కొట్టి.. తామేదో గొప్ప సినిమా తీసినట్టు.. తామేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫోజులు కొడుతుంటారు మన డైరెక్టర్లు. అయితే సుకుమార్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాడేమో అనిపిస్తుంది. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి విదితమే. నిజానికీ ఈ […]

Written By: admin, Updated On : August 26, 2020 6:49 pm
Follow us on


క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని కథలను కాపీ కొడితే దరిద్రంగా ఉంటుంది. ఏ హాలీవుడ్ సినిమా నుండో.. ఏ నవల నుండో కాపీ కొట్టి.. తామేదో గొప్ప సినిమా తీసినట్టు.. తామేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫోజులు కొడుతుంటారు మన డైరెక్టర్లు. అయితే సుకుమార్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాడేమో అనిపిస్తుంది. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి విదితమే. నిజానికీ ఈ సినిమా స్టోరీ లైన్ ఎప్పుడో బయటకు పొక్కింది. శేషాచలం అడవుల్లో ఉన్న గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి ఈ సినిమా ఉంటుందని.. అడవిలో కథ ఎక్కువగా నడుస్తోందని.. సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా కనిపించనున్నాడని.. కథలో బన్నీ క్యారెక్టర్ చుట్టూ మంచి ఎమోషన్ ఉంటుందని ఇలా చాలానే వినిపించాయి.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

అయితే ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించి సుకుమార్ పై కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ కాపీ స్టోరీ అని, ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత డా. వేంపల్లి గంగాధర్ తను రాసిన ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు.. అనే పుస్తకాన్ని కాపీ కొట్టి సినిమాను తీస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా సుకుమార్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఏ డైరెక్టర్ అయినా, ఒక సినిమా తీస్తున్నాడు అంటే.. ఆ సినిమా తాలూకు కథకు సంబంధించిన నవలలు, పుస్తకాలను చదువుతారు. వాటిల్లో అంశాలను కాపీ కొట్టి తమ సినిమా సీన్స్ ను రాసుకుంటారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ రాసే సినిమా డైలాగ్స్ లో.. సగంకు పైగా యండమూరి పుస్తకాల నుండే ఉంటాయి.

Also Read: అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

ఇప్పుడు సుకుమార్ కూడా అలాగే చేస్తోన్నట్లు కనిపిస్తోంది. ఒక్క సుకుమారే కాదు, పాత తరం డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు కాలం నుండి ఇలాగే జరుగుతుంది. గొప్ప రచయిత చలం రాసిన పుస్తకాల నుండి ఎన్నో అంశాలను సినిమా వాళ్ళు డైరెక్ట్ గానే కాపీ కొట్టారు. కొడుతూనే వస్తున్నారు. మొదటి నుండి తెలుగు సాహిత్యకారులను సినిమా రంగం తొక్కేస్తోనే ఉంది. ఇక గతంలోనూ వేంపల్లి రాసిన మొండి కత్తి పుస్తకాన్ని ప్రేరణగా తీసుకొని త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని తీశాడనే ఆరోపణలు ఆ మధ్య బాగా వినిపించాయి. ఇప్పుడు మళ్లీ అదే వేంపల్లి రాసిన పుస్తకాన్ని కాపీ కొట్టి సుకుమార్ పుష్ప అనే సినిమా తీస్తున్నాడంటూ స్వయానా వేంపల్లే ఆరోపిస్తున్నాడు.