139మంది రేప్ కేసులో మాటమార్చిన బాధితురాలు..!

139మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతీ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యువతీ ఆరోపణలపై పోలీసులు.. ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాధిత యువతీ పట్ల వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండగా.. మరికొందరేమో ఇందులో వేరే కోణం ఉందని వాదిస్తున్నారు. తొలి నుంచి ఈ కేసులో సెలబ్రీలకు కూడా సంబంధం ఉందని చెప్పిన బాధితులు సడెన్ గా మాటమార్చడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. […]

Written By: Neelambaram, Updated On : August 31, 2020 3:54 pm
Follow us on

139మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతీ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యువతీ ఆరోపణలపై పోలీసులు.. ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాధిత యువతీ పట్ల వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండగా.. మరికొందరేమో ఇందులో వేరే కోణం ఉందని వాదిస్తున్నారు. తొలి నుంచి ఈ కేసులో సెలబ్రీలకు కూడా సంబంధం ఉందని చెప్పిన బాధితులు సడెన్ గా మాటమార్చడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read : సంచలనం: 139మంది రేప్ కేసులో భారీ ట్విస్ట్

ఈ రేప్ కేసులో తొలి నుంచి బాధితులు 139మంది తనను రేప్ చేశారని చెబుతోంది. ఇందులో సిని ఇండస్ట్రీకి చెందిన యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు తనపై అత్యాచారం చేసినట్లు భాదితులు ఆరోపించింది. దీంతో వారిద్దరు మీడియా ముందుకొచ్చి ఆమెతో తమకు సంబంధం లేదని చెబుతూ లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. ఈ కేసులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడిస్తున్న సమయంలో బాధితురాలు మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె గతంలో చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా మీడియా ముందుకొచ్చిన బాధిత యువతీ తనను 139మంది అత్యాచారం చేయలేదని చెప్పుకొచ్చింది. దీనిలో సెలబ్రెటీలకు సంబంధం లేదని చెప్పడంలేదని తన వల్ల వాళ్లు ఇబ్బందులు పడ్డారని.. వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పింది. డాలర్ బాయ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించడంతో యాంకర్ ప్రదీప్, సీని నటుడు కృష్ణుడి పేర్లను అత్యాచారం కేసులో చెప్పినట్లు పేర్కొంది. తనపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవేగానీ ఇందులో వారిద్దరి సంబంధం లేదని బాధితులు మీడియా ఎదుట చెప్పింది.

Also Read : కోమటిరెడ్డికి కీలక పదవీ దక్కనుందా?

డాలర్ బాయ్ కారణంగానే 50శాతం వేధింపులకు గురికాగా మరో 50శాతం బయటి వ్యక్తుల నుంచి ఇబ్బందులు పడినట్లు బాధితురాలు వాపోయింది. తనకు మహిళా సంఘాలు, కులసంఘాలు, మీడియా, పోలీసులు మద్దతు ఇచ్చి డాలర్ బాయ్ వేధింపుల నుంచి రక్షించారని తెలిపింది. తనను లైంగిక వేధించిన వివరాలను మూడు విభాగాలు చేసి పోలీసులకు అందించచడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని చెబుతుండటం గమనార్హం.

యువతీ ఒకసారి సెలబ్రెటీలకు సంబంధం ఉందని.. మరోసారి వారికి సంబంధం లేదని చెబుతుండటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బాధితులపై ఒత్తిడి చేసి ఎవరైనా వారి పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. సస్పెన్స్ థిల్లర్ ను తలపించేలా రోజుకో ట్వీస్టు ఇస్తున్నా ఈ కేసు చివరికీ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!