https://oktelugu.com/

మిలియన్ మార్చ్.. కేసీఆర్ ను కొట్టడం కోదండరాంతో సాధ్యమేనా?

అప్పటి ప్రొఫెసర్ కోదండరాం వేరు.. ఇప్పటి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం వేరు. మనిషి ఒక్కడే కానీ విశ్వసనీయతలో మాత్రం ప్రొఫెసర్ తేలిపోయాడు. Also Read: రామతీర్థం ఘటన.. జగన్ సంచలన నిర్ణయం ఇదే ప్రొఫెసర్ కోదండరాం.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడి తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఓడిపోవడమే కాదు.. ఆ పార్టీ నుంచి ఒక్కరు గెలవలేదు. కానీ ఇదే కోదండరాం తెలంగాణ […]

Written By: , Updated On : January 4, 2021 / 09:21 PM IST
Follow us on

KCR Kodandaram

అప్పటి ప్రొఫెసర్ కోదండరాం వేరు.. ఇప్పటి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం వేరు. మనిషి ఒక్కడే కానీ విశ్వసనీయతలో మాత్రం ప్రొఫెసర్ తేలిపోయాడు.

Also Read: రామతీర్థం ఘటన.. జగన్ సంచలన నిర్ణయం

ఇదే ప్రొఫెసర్ కోదండరాం.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడి తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఓడిపోవడమే కాదు.. ఆ పార్టీ నుంచి ఒక్కరు గెలవలేదు.

కానీ ఇదే కోదండరాం తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడి తెలంగాణ జాతి మొత్తాన్ని ఏకం చేశారు. తెరవెనుక టీఆర్ఎస్, కేసీఆర్ ఉండడంతో ఈయన బలంగా కనిపించారు. నాడు ఉద్యమంలో ‘మిలియన్ మార్చ్’ పిలుపును కోదండరాం ఇస్తే తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక , ప్రజలంతా కలిసి హైదరాబాద్ ను దిగ్బంధించారు. 20 లక్షలమంది తరలివచ్చి విజయవంతం చేశారు.

Also Read: అటు కేసీఆర్.. ఇటు జగన్ కు షాకిస్తున్న బండి సంజయ్

కానీ ఇప్పుడు అదే కేసీఆర్ తో కోదండరాం ఫైటింగ్ పెట్టుకుంటున్నాడు. తాజాగా 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోదండరాం చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు తెలంగాణలోని సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదామని కోదండరాం పిలుపునిచ్చాడు. ఈనెల 20 వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు, చివరగా చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు.

అయితే నాటి కోదండరాం వెంట గులాబీ దళం ఉంది. కాంగ్రెస్, బీజేపీ కూడా నడిచాయి. కానీ ఇప్పుడు ఆయన ఒంటరి. వెనుకాల ఏపార్టీ లేదు. అయినా బలమైన కేసీఆర్ ను ఢీకొంటున్నారు.మరి కోదండరాంతో ఇది సాధ్యమవుతుందా? లేదా అన్నది వచ్చే ఫిబ్రవరిలో కోదండరాం నిర్వహించే ‘మిలియన్ మార్చ్’తో తేలనుంది. అయినా కేసీఆర్ ఊరుకుంటాడా? గృహనిర్బంధం, అరెస్ట్ లతో ఈ మార్చ్ ను మార్చేస్తాడు. సో వెయిట్ అండ్ సీ..

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్