
Samantha: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సుమారుగా దశాబ్ద కాలం నుండి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత..ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు..సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కి అర్హురాలు..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న సమంత ఇక సౌత్ సినిమాలలో నటించదా?, తన బేస్ మొత్తాన్ని బాలీవుడ్ కి షిఫ్ట్ చేస్తుందా అంటే అవుననే అంటున్నారు.
రీసెంట్ గా ఆమె హైదరాబాద్ ఉంటున్న ఫ్లాట్ ని ఖాళీ చేసి తన అమ్మ ని తీసుకొని ముంబై కి షిఫ్ట్ అయిపోయిందట..ఆమెకి బాలీవుడ్ లో వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తుండడమే అందుకు కారణమని అంటున్నారు.హిందీ లో బంపర్ హిట్ గా నిల్చిన ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో విలన్ గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సమంతకి బాలీవుడ్ లో వరుసగా ఆఫర్ల వర్షం కురిసింది.
అన్నీ అనుకున్నట్టు సరిగ్గా జరిగి ఉంటే ఆమె ఒప్పుకున్న బాలీవుడ్ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈపాటికి విడుదల అయ్యిపోయి ఉండాలి, కానీ అనుకోకుండా మధ్యలో ఆమెకి ‘మయోసిటిస్’ అనే వ్యాధి తీవ్ర రూపం దాల్చడం..దానికి ఆమె శస్త్ర చికిత్స చేయించుకోవడం వంటివి జరిగాయి..రీసెంట్ గానే ఆమె ‘మయోసిటిస్’ నుండి పూర్తిగా కోలుకుంది..ఇప్పుడు వరుసగా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ని పూర్తి చెయ్యడానికి ముంబై కి వెళ్ళిపోయింది.రీసెంట్ గానే ఆమె ‘సీతడెల్’ అనే అమెజాన్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంది..బాలీవుడ్ క్రేజీ స్టార్ వరుణ్ ధావన్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ తర్వాత కూడా ఆమె ప్రాజెక్ట్స్ అన్నీ బాలీవుడ్ లోనే ఎక్కువ..తెలుగు లో ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం చేస్తుంది..ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది..ప్రస్తుతం ఆమె చేతిలో ఈ ఒక్క సినిమా మినహా బ్యాలన్స్ ఉన్న తెలుగు ప్రాజెక్ట్స్ ఏమి లేవు..అందుకే ఇక ఆమె టాలీవుడ్ లో నటించదేమో అనే టాక్ ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.