https://oktelugu.com/

టైమ్ పాస్ కోసం స్క్రాచ్ కార్డు కొన్నాడు.. కోటీశ్వరుడు అయ్యాడు!

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా వర్జీనియాలో బాలుడిని స్క్రాచ్ కార్డ్ రూపంలో అదృష్టం వరించింది. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా రెండు లక్షల డాలర్లు( ఇండియన్ కరెన్సీలో కోటీ 40 లక్షల రూపాయలు) బాలుడు గెలుచుకున్నాడు. ఊహించని విధంగా కోట్ల రూపాయలు రావడంతో బాలుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇతరులు సైతం ఈర్ష్య పడేలా బంపర్ లాటరీ గెలుచుకున్న యువకుడి పేరు హెబర్ట్ స్రగ్స్. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 15, 2020 / 10:28 AM IST
    Follow us on

    అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా వర్జీనియాలో బాలుడిని స్క్రాచ్ కార్డ్ రూపంలో అదృష్టం వరించింది. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా రెండు లక్షల డాలర్లు( ఇండియన్ కరెన్సీలో కోటీ 40 లక్షల రూపాయలు) బాలుడు గెలుచుకున్నాడు. ఊహించని విధంగా కోట్ల రూపాయలు రావడంతో బాలుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇతరులు సైతం ఈర్ష్య పడేలా బంపర్ లాటరీ గెలుచుకున్న యువకుడి పేరు హెబర్ట్ స్రగ్స్.

    Also Read: వెనక్కి వెళ్తున్న జలపాతం.. వీడియో వైరల్!

    పూర్తి వివరాలలోక్ వెళితే హెబర్ట్ స్క్రగ్ తన తల్లితో కలిసి సరదాగా సరుకులు కొనుగోలు చేసే దుకాణానికి వెళ్లాడు. తల్లి సరుకులు కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉండటంతో హెబర్ట్ కు బోర్ కొట్టింది. అదే సమయంలో స్క్రాచ్ కార్డ్ లాటరీలను ఆ దుకాణంలో విక్రయిస్తూ ఉండటంతో బాలుడు ఒక స్క్రాచ్ కార్డును కొనుగోలు చేశాడు. అంతలోనే తల్లి షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వెళదామని చెప్పగా బాలుడు ఇంటికి వెళ్లిపోయాడు.

    Also Read: రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

    అనంతరం ఆ స్క్రాచ్ కార్డును గీకగా అందులో 1.4 కోట్ల రూపాయలు గెలుచుకున్నట్లు ఉండటంతో బాలుడు ఎగిరి గంతేశాడు. అనంతరం ఆ విషయం తల్లికి చెప్పాడు. మొదట తల్లి నమ్మకపోయినా స్క్రాచ్ కార్డును చూసిన తరువాత కొడుకు నిజంగానే కోటీ 40 లక్షల రూపాయలు గెలిచాడని గుర్తించి సంతోషించింది. తల్లి షాపింగ్ చేసిన టైంలో కోట్లు సంపాదించిన బాలుడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.