Homeటాప్ స్టోరీస్TVS Group: టీవీఎస్ కంపెనీలో ఆస్తుల కోసం గొడవ.. ఆ వివాదానికి కారణమేంటంటే..

TVS Group: టీవీఎస్ కంపెనీలో ఆస్తుల కోసం గొడవ.. ఆ వివాదానికి కారణమేంటంటే..

TVS Group: మనదేశంలో ప్రఖ్యాత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీలో ఇంటి పోరు ముదిరింది. కుటుంబ ఆస్తిలో ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అసలు ఆ కంపెనీలో ఏం జరుగుతోంది.. ఈ వివాదానికి కారణమేంటి.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం టీవీఎస్ కంపెనీలో నలుగురు కుటుంబ సభ్యులు ఒక అవగాహన ఒప్పందానికి వచ్చారు. దానిమీద సంతకం చేశారు. టీవీఎస్ బ్రాండ్.. ట్రేడ్ మార్క్ ను ఎక్కడ […]

TVS Group: మనదేశంలో ప్రఖ్యాత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీలో ఇంటి పోరు ముదిరింది. కుటుంబ ఆస్తిలో ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అసలు ఆ కంపెనీలో ఏం జరుగుతోంది.. ఈ వివాదానికి కారణమేంటి.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం టీవీఎస్ కంపెనీలో నలుగురు కుటుంబ సభ్యులు ఒక అవగాహన ఒప్పందానికి వచ్చారు. దానిమీద సంతకం చేశారు. టీవీఎస్ బ్రాండ్.. ట్రేడ్ మార్క్ ను ఎక్కడ వాడాలి అనేది అందులో ప్రస్తావించారు. టీవీఎస్ మోటార్.. టీవీఎస్ క్రెడిట్ బాధ్యతలను సుదర్శన్ చూసేవారు. సుందరం.. క్లెటన్, టాఫే బాధ్యతలను లక్ష్మి.. మల్లిక చూస్తున్నారు. అయితే 2025 ఏప్రిల్ 16న టీవీఎస్ హోల్డింగ్స్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో వివాదాలు మొదలయ్యాయి.

ఈ వివాదాలు ఇప్పుడు న్యాయ పోరు దిశగా కదులుతున్నాయి. ఉమ్మడి ఆస్తులలో సమాన వాటా పంచాలని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కు ఆయన కుమార్తె లక్ష్మీ వేణు నోటీసులు పంపించారు. ఆ నోటీసులు పంపిస్తున్న సమయంలో హిందూ వారసత్వ చట్టం 1956 లోని సెక్షన్ 6 ప్రకారం.. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెకు హక్కు ఉందని.. కాబట్టి ఆస్తిలో తనకు సమాన హక్కు ఉందని ఆమె ప్రస్తావించారు.ఈ వివాదానికి 2020లో ఉమ్మడి కుటుంబం ఒప్పందం ప్రధాన కారణంగా నిలిచింది. 2024లో వేణు శ్రీనివాసన్ కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.. టీవీఎస్ గ్రూపులో నాలుగు ప్రధాన కుటుంబ శాఖల మధ్య అధికారికంగా వ్యాపారాల విభజనకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో గ్రూపులో కీలకమైన టీవీఎస్ మోటార్.. టీవీఎస్ హోల్డింగ్స్.. సుందరం క్లేటాన్, టీవీఎస్ క్రెడిట్ సంస్థలు వేణు శ్రీనివాసన్ కు సొంతమయ్యాయి. ఆ ఆస్తులు వీఎన్ ట్రస్ట్.. టీవీఎస్ హోల్డింగ్ కింద ఉమ్మడిగానే ఉన్నాయి. వేణు.. ఆయన భార్య మల్లిక.. కుమారుడు సుదర్శన్.. కుమార్తె లక్ష్మి మధ్య విడివిడిగా పంపకాలు అస్సలు జరగలేదు. అయితే 2024లో వారు నలుగురు కలిసి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం టీవీఎస్ మోటార్.. టీవీఎస్ క్రెడిట్ బాధ్యతలను వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ కొనసాగుతుండగానే గత ఎడాది ఏప్రిల్ 16న టీవీఎస్ హోల్డింగ్స్ కు సంబంధించి సిగ్నిఫికేట్ బెనిఫిషియల్ ఓనర్ ఆ కంపెనీ స్టాక్ ఎక్స్ చేంజ్ లో నమోదు చేశారు. అప్పటినుంచి వివాదాలు మొదలయ్యాయి.

ఇక ఏడాది అక్టోబర్లో టీవీఎస్ హోల్డింగ్స్ వార్షిక నివేదిక ద్వారా ఎస్ బి ఓ వివరాలు చర్చకు వచ్చాయి. దీంతో లక్ష్మి.. మల్లిక దానిమీద అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిగా రెండు సంవత్సరాలు నాటి ఎంఓయూను అడ్డుపెట్టుకొని అత్యంత విలువైన టీవీఎస్ మోటార్ సంస్థను సుదర్శన్ కు అప్పగించారని.. తక్కువ విలువ ఉన్న సుందరం క్లేటన్ మాత్రమే దక్కేలాగా చూస్తున్నారని లక్ష్మి ఆరోపణలు చేస్తున్నారు. ఆరు సంవత్సరాల నాటి ఒప్పందం ప్రకారమే వేణు శ్రీనివాసన్ కు టీవీఎస్ దక్కింది. అందులో తనకు సమాన వాటా ఉంటుందని లక్ష్మీ చెబుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగింది కేవలం టీవీఎస్ బ్రాండ్ వినియోగానికి సంబంధించిన ఎంవోయూ మాత్రమేనని.. ఆస్తుల విభజన కాదని ఆమె చెబుతున్నారు. అయితే ఇందులో వేణు శ్రీనివాసన్ మాత్రం వివాదానికి కారణమైన ఆస్తులు మొత్తం తాను సొంతంగా సంపాదించుకున్నానని.. అవి కుటుంబ ఆస్తులు కాదని వాదిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper