Telangana Governor Change BJP Strategy: తెలంగాణ రాజ్‌భవన్‌లో సీన్ మళ్లీ మొదటికి వచ్చిందా? ‘నిశ్శబ్దంగా’ ఉన్న గవర్నర్ స్థానంలోకి ‘చురుకైన’ కొత్త గవర్నర్ రావడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఏదో ఒక పెద్ద సంచలనమే రాబోతోందని అర్థమవుతోంది..
Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశాంతంగా అందరితో కలిసిపోయి కాలం గడిపేస్తుంటే ఉన్నట్టుండి ఆయనను మహారాష్ట్రకు మార్చడం, హిమాచల్ ప్రదేశ్ నుంచి శివ ప్రతాప్ శుక్లాను తీసుకురావడం చూస్తుంటే… ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ మార్పునా లేక 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వేసిన మాస్టర్ ప్లానా? అని రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.యూపీ రాజకీయాల్లో ఆరితేరిన శివ ప్రతాప్ శుక్లా గారు రాకతో ఇక రాజ్ భవన్ ‘రిమోట్’ ఎక్కడి నుంచి పనిచేస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.
అజారుద్దీన్ గారూ.. ఆ గడియారం టిక్-టిక్ మంటోంది!
అసలు అసలైన ‘ట్విస్ట్’ ఇక్కడే ఉంది. మన టీజేఎస్ అధినేత కోదండరాం ఎమ్మెల్సీ సీటు దశాబ్దాల కాలక్షేపంలా మారితే ఇప్పుడు మంత్రి అజారుద్దీన్ కూడా ఆ ‘త్రిశంకు స్వర్గంలో’ చిక్కుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 6 నెలల్లోపు సభ్యత్వం ఉండాలి. సమయం దగ్గరపడుతోంది. క్యాబినెట్ పంపిన ఫైల్ ఇప్పుడు కొత్త గవర్నర్ టేబుల్ మీదకు వెళ్తుంది. ఆయన ఆ ఫైల్‌ను స్వీకరిస్తారా లేక “ఇది సెట్ అవ్వదు” అని పక్కన పెడతారా? సుప్రీంకోర్టు తీర్పుల దాకా ఎందుకు? ‘రాజ్ భవన్ కోర్టు’లో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మొత్తానికి.. ‘మైత్రి’ ముగిసినట్టేనా?
ఇప్పటిదాకా “రాజకీయంగా విరోధం.. పాలనాపరంగా మైత్రి” అని రేవంత్ సర్కార్ సాఫీగా నడిపిస్తోంది. కానీ, కొత్త గవర్నర్ రాకతో ఆ ‘మైత్రి’ కూడా ఎండమావిలా మాయమవుతుందేమోనన్న భయం అధికార పక్షాన్ని వెంటాడుతోంది. మొత్తానికి గవర్నర్ వ్యవస్థ ఇప్పుడు తెలంగాణలో మళ్లీ ఒక ‘కీలక రాజకీయ అస్త్రం’గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.