Mount Everest snowstorm: శివుడు కొలువై ఉన్న ప్రాంతంగా హిమాలయాలు ప్రాచుర్యం పొందాయి. హిమాలయాలలో ఎవరెస్ట్ శిఖరం అత్యంత ఎత్తైనది. అత్యంత కఠినమైన వాతావరణం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ శిఖరాన్ని అధిరోహించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం అత్యంత కఠినమైన వాతావరణంతో ఉండేది . సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందువల్లే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ప్రతిరోజు వివిధ దేశాల నుంచి పర్వతా రోహకులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం పర్యాటక ప్రాంతంగా వినతికెక్కుతోంది.
ముందుగానే చెప్పినట్టు ఎవరెస్టు శిఖరం పరిసర ప్రాంతంలో కఠినమైన వాతావరణం ఉంటుంది.. ఇక్కడ శీతాకాలం ప్రారంభం నుంచి ఎండాకాలం వరకు మంచు కురుస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మంచు తుఫాన్లు కూడా ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం ఎవరెస్టు శిఖరం వద్ద మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. విపరీతమైన హిమపాతం వల్ల అక్కడ వాతావరణం మొత్తం అంటార్కిటికాను తలపిస్తోంది.. సాధారణంగా ఇలాంటి సమయాలలో పర్వతారోహకులు వెనుకడుగు వేస్తారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలంటే భయపడుతుంటారు. కానీ ఈసారి పర్వతారోహకులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తున్న క్రమంలోనే విపరీతంగా మంచు కురవడం మొదలైంది. ఈ వాతావరణం వల్ల టిబెట్ వైపుగా 16 వేల అడుగుల ఎత్తులో 1000 మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. మంచు విపరీతంగా కురవడం వల్ల చాలామంది హైపో తెర్మియా తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
పర్వతారోహకులు హిమపాతం వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు హిమాలయ పర్వతాల సమీపంలో ఉండే నేపాల్ దేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. ప్రాణనష్టం కూడా భారీగానే చోటుచేసుకున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి హిమాలయ పర్వతాలలో దట్టంగా కురిసే మంచు వల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పైగా ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్ నెలకొంది. ఇది ఎప్పటిలోగా ముగుస్తుందో తెలియదు. కానీ భారీగా హిమపాతం ఏర్పడుతున్న నేపథ్యంలో పర్వతారోహకులు ఇబ్బంది పడుతున్నారు. శ్వాస కోశ సమస్యలతో నరకం చూస్తున్నారు. అయితే తమను ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపించాలని పర్వతారోహకులు కోరుతున్నారు.
Nearly 1,000 people were stranded at Mt. Everest’s eastern slope camp (4,900 m altitude) after a sudden snowstorm hit the area.
Hundreds of rescuers are clearing snow to reopen the route, as tents collapsed and some campers showed signs of hypothermia.#Tibet #Everest pic.twitter.com/hl5kW0Oawj— Shanghai Daily (@shanghaidaily) October 5, 2025