Shambhala Nagaram: ఈ భూమి మీద ఎన్నో విశేషాలు, వింతలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. కొందరు పరిశోధకులు కొన్ని విషయాల గురించి ఎన్ని పరిశోధనలు చేసినా వాటి గురించి తెలియ రాలేదు. వాటిలో ముఖ్యమైనది శంభాల నగరం గురించి. భారతదేశానికి ఉత్తరాదిన ఉన్న హిమాలయాల్లో శంభాల నగరం దాగి ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇది రహస్య నగరం అని.. ఇది అందరికీ కనిపించదని.. ఇందులో కొన్ని విశేషాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. శంబాల నగరం గురించి 1920లోనే రష్యాకు చెందిన కొందరు పరిశోధకులు ఇక్కడి విజయాలో తెలుసుకోవాలని అనుకున్నారు. అలాగే 1930లో నాజీ నేత ఇట్లర్ శంబాల గురించి తెలుసుకోవాలని తన బృందాన్ని పంపించాడు. అయితే వారికి ఎదురైనా కొన్ని విశేషాలను ప్రపంచానికి చెప్పారు. అయినా ఇక్కడ కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతూ ఉంటారు. వాటి వివరాలు కి వెళ్తే..
Also Read: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు
ప్రస్తుతం మనం పూజించే హనుమంతుడు, మహాభారతంలోని అశ్వత్థామ వంటి మహా పురుషులు శంభాల నగరంలో ఇప్పటికీ జీవించి ఉన్నారని పురాణాలు చెబుతూ ఉంటాయి. హిమాలయాల్లోని మనుషులు చేరలేని చోటులో ఈ నగరం దాగి ఉందని అంటున్నారు. ఇక్కడ హిందూ, బౌద్ధమతం పాటిస్తారని, ఇక్కడ ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని పేర్కొంటున్నారు. శంభాల నగరంలో జీవించేవారు ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని, ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తారని చెబుతున్నాయి.
అయితే శంభాల నగరం గురించి తెలుసుకునేందుకు చారిత్రక పరిశోధకురాలు alexandra Day evid neel 56 ఏళ్ల వయసులో ప్రాన్స్ నుంచి టిబెట్ కు వచ్చారు. ఇక్కడ ఉన్న బౌద్ధ గురువుల ద్వారా శంభాల నగరం గురించి తెలుసుకున్నారు. పాశ్చాత్తా దేశాల నుంచి టిబెట్లో కాలు మోపిన తొలి యూరప్ వనితగా ఆమె ప్రఖ్యాత పొందారు.
వీరే కాకుండా చాలామంది పరిశోధకులు శంబాల నగరంపై పరిశోధనలు చేశారు. అయితే లడక్ ప్రాంతానికి చెందిన రాజు ఒకసారి శంబాల నగరానికి వచ్చారు. ఇక్కడ ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలుసుకున్న ఆయన.. ఇక్కడికి రాగానే ఒకరు కూడా కనిపించలేదు. 10 లక్షల మంది జీవించే ఈ నగరంలో రాత్రికి రాత్రి మాయమైనట్లు ఆయన తెలుసుకున్నారు. అసలు వీళ్లంతా ఎక్కడికి వెళ్లారు? అంత రాత్రివేళ ఎటువైపు వెళ్లారు? అనేది ఇప్పటికీ అంతు పట్టని విషయం.
అలాగే శంభాల నగరం నుంచి కొన్ని సొరంగ మార్గాలు భూమిలోకి ఉన్నాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం చేయబడి ఉన్నాయి. వీటిని ఎవరు ధ్వంసం చేశారు అని రహస్యం అలాగే ఉండిపోయింది. శంభాల నగరానికి సాధారణ ప్రజలు వచ్చే అవకాశం లేదు. ఎంతో శ్రమకూర్చి పరిశోధకులు, రాజులు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలనుకున్నారు. అయితే నగరం కనిపించింది గాని.. మనుషులు మాత్రం ఎవరు కనిపించలేకపోయారు.
కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్న ప్రకారం.. ఇక్కడ జీవించేవారు స్వచ్ఛమైన వారై ఉంటారని, వారు సాధారణ మనుషులకు కనిపించారని అంటుంటారు. ఎంతో పుణ్యఫలం చేసుకున్న వారు.. దైవచింత ఉన్నవారు మాత్రమే ఇక్కడి ప్రాంతాన్ని ప్రజలతో చూడగలుగుతారని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో హనుమంతుడు, అశ్వత్థామలు ఇంకా జీవించే ఉన్నారని.. వీరు సాధారణ దృష్టితో చూస్తే కనిపించారని.. దివ్య దృష్టితో చూస్తే మాత్రమే కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ శంభాల నగరం ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా కొనసాగుతుందని పేర్కొంటున్నారు.