MLC Kavitha Vs Harish Rao: బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. తేడా వస్తే అన్ని తేడాగానే ఉంటాయి. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో అదే కనిపిస్తోంది. కవిత రాజేసిన కుంపటి కారు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఎక్కడ వరకు దారితీస్తుంది.. ఎంతవరకు వెళుతుంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాకపోతే ప్రధానంగా తెలంగాణ బతుకమ్మ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడిని టార్గెట్ చేసిన నేపథ్యంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: కవిత ఆయుధం ఇచ్చింది.. రేవంత్ ఏం చేస్తారో?
డిప్యూటీ స్పీకర్ పదవి తనకు వద్దని కెసిఆర్ అన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు.. అప్పట్లోనే మంచి ఆఫర్ వచ్చింది. దానిని తీసుకొని వ్యాపారం మొదలుపెడతామని హరీష్ రావు కెసిఆర్ కు సూచించారు. ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి తీసుకున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ ను కలిశారు.. 2018లో ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు నగదు సహాయం చేశారు. 2023 ఎన్నికల్లో కూడా 25 మంది ఎమ్మెల్యేలకు ఆర్థికంగా సహాయం చేశారు. ఇదంతా అవినీతి సొమ్ము కాదా.. పార్టీని కాదని మరో విధంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది.. అంటే అధికారం రాదని ఫిక్స్ అయ్యారా.. ఒకవేళ తక్కువ మెజారిటీతో అధికారం వస్తే.. పార్టీలో తన ప్రభావాన్ని చూపించుకోవాలని డిసైడ్ అయ్యారా.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత హరీష్ రావు మీద లేదా” అంటూ కవిత ప్రశ్నల పరంపర కురిపించారు.
సమాధానం చెప్పాల్సిందేనా
కవిత ప్రశ్నల పరంపర కురిపించిన నేపథ్యంలో.. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత హరీష్ మీద ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అది రాజకీయాలలో భాగం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. హరీష్ మీద ఆరోపణలు చేసింది సాక్షాత్తు కెసిఆర్ కుమార్తె. పైగా హరీష్ రావు ఇంట్లో కుటుంబ సభ్యురాలు. దీంతో ఆమె చేసిన ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది.. అంతేకాదు ప్రతి అంశాన్ని సాక్ష్యంతో సహా వివరించింది. ఇలాంటి అప్పుడు హరీష్ రావు సమాధానం చెప్పాలని.. సమాధానం చెప్పకపోతే అవన్నీ కూడా నిజమని నమ్మాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా గులాబీ దళపతి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని.. భారత రాష్ట్ర సమితి భవితవ్యం ఇబ్బందులలో పడిందని జాగృతి వ్యవస్థాపకురాలు చేసిన వ్యాఖ్యలు ఆషామాషివి కావు.. తన సోదరుడిని.. తండ్రి గురించి గొప్పగానే చెప్పిన కవిత.. హరీష్, సంతోష్ విషయానికి వచ్చేసరికి తీవ్రంగా స్పందించారు.