Balakrishna Boyapati Clash: బాలయ్య-బోయపాటిలకు స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. వీరిద్దరి సూపర్ హిట్ కాంబో. అఖండ 2తో నాలుగోసారి జతకడుతున్నారు. బోయపాటిని బాలయ్య ఎంతో అభిమానిస్తారు. అంతటి సన్నిహితుడు మీదే బాలకృష్ణ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడట.
మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను(BOYAPATI SREENU). యాక్షన్ తో కూడిన ఎమోషనల్ మూవీస్ బోయపాటి బలం. హీరో ఒక్క గుద్దుకి పది మంది గాల్లో లేవడం ఆయన సినిమాల్లో ఎక్కువగా చూస్తాం. అయినప్పటికీ ప్రేక్షకులు అంగీకరించేలా యాక్షన్ ఎపిసోడ్ కి ఎమోషనల్ బ్యాగ్రౌండ్ సెట్ చేస్తాడు. ఇక బాలయ్యకు అయితే బోయపాటి సెట్ చేసే కథలు, ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. పంచ్ డైలాగ్స్ మరింత ప్రత్యేకం. సింహ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ లెజెండ్, అఖండ తో పీక్స్ కి చేరింది. ఈ మూడు సూపర్ హిట్ కొట్టాయి.
Also Read: ‘వార్ 2’ లో ఎవరు హీరో..? ఎవరు విలన్..? ట్రైలర్ అయ్యోమయంలోకి నెట్టేసిందిగా!
ఒక హిట్ కొడితే బాలయ్యకు(BALAKRISHNA NANDAMURI) నాలుగైదు ప్లాప్స్ పడతాయి. బాలయ్య ప్లాప్స్ లో ఉన్న ప్రతిసారి బోయపాటి సేవియర్ అయ్యాడు. అఖండ చిత్రానికి ముందు అయితే బాలయ్య పరిస్థితి ఘోరంగా ఉంది. రూలర్ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయి. రూలర్, ప్రతిరోజూ పండగే ఒకే రోజు విడుదలయ్యాయి. కనీసం సాయి ధరమ్ తేజ్ సినిమా ముందు రూలర్ నిలబడలేకపోయింది. ప్రతిరోజూ పండగే బ్లాక్ బస్టర్ కాగా, రూలర్ డిజాస్టర్ అయ్యింది.
అఖండతో బాలయ్యకు బూస్ట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. బాలయ్యను అఘోరాగా డీగ్లామర్ లుక్ లో ప్రజెంట్ చేయడం సాహసమే. కానీ ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అఖండ తర్వాత బాలయ్య నటించిన ప్రతి సినిమా హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం వీరి కాంబోలో అఖండ 2 తెరకెక్కుతుంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో అఖండ 2 నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25 విడుదల తేదీగా ప్రకటించారు. బాలయ్య ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
Also Read: హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్!?
తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి మీద బాలయ్య ఫైర్ అయ్యాడనే న్యూస్ సంచలనం రేపుతోంది. కారణం తెలియదు కానీ అఖండ 2 సెట్స్ లో బోయపాటి మీద అసహనం ప్రదర్శించిన బాలయ్య, తోకతొక్కిన తాచులా లేచాడట. బాలయ్య ఆగ్రహాన్ని దగ్గరగా చూసిన బోయపాటి కంగుతిన్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పుకార్లలో నిజమెంతో తెలియదు. బాలయ్య ముక్కోపి అన్న సంగతి మాత్రం నిజం. ఆయనకు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అభిమానులను, అసిస్టెంట్స్ మీద బాలయ్య చేయి చేసుకున్న సందర్భాలు అనేకం.