Journalist Swetha personal life: పాత్రికేయురాలు స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో.. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వేచ్ఛ మొదటి వివాహం.. భర్తతో విడాకులు తీసుకున్న తీరు.. మరో వ్యక్తికి దగ్గరైన సందర్భం.. ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే స్వేచ్ఛ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు స్వేచ్ఛ సన్నిహితంగా ఉన్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానల్ లోనే అతడు గతంలో పనిచేశాడని.. ఒకే దగ్గర పని చేయడంతో వారిద్దరూ దగ్గరయ్యారని తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తికి గతంలోని వివాహం జరగడంతో.. స్వేచ్ఛ ముందుగా అతడి ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చి వివాహం చేసుకుంటానని చెప్పడంతో స్వేచ్ఛ అంగీకరించిందని సమాచారం.. స్వేచ్ఛకు ఇచ్చిన మాట నిలుపుకోవడంలో ఆ వ్యక్తి విఫలమయ్యాడు. తన భార్యకు విడాకులు ఇవ్వకుండా స్వేచ్ఛతో సంబంధం కొనసాగించడం ప్రారంభించాడు.
స్వేచ్ఛ, ఆ వ్యక్తి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. వివాహం చేసుకునే సందర్భంలోనే వీరిద్దరికి పలుమార్లు గొడవలు జరగడం.. తర్వాత వారిద్దరూ కలిసిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే స్వేచ్ఛ, ఆ వ్యక్తి ఇటీవల గొడవ పడ్డారని తెలుస్తోంది. అందువల్లే ఇద్దరు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య గొడవ జరిగిందని.. ఈసారి మాత్రం స్వేచ్ఛ తీవ్రమైన మనస్థాపానికి గురై ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read: యాంకర్ స్వేచ్ఛ తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు
అమ్మ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేది..
అటు తండ్రికి తనకు తెలియకుండానే దూరం కావడం.. ఇటు మాతృమూర్తిని పోగొట్టుకోవడంతో ఆ చిన్నారి బాధ మామూలుగా లేదు. ఆమె స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతోంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు స్వేచ్ఛ ఆమెను కౌగిలించుకునేది. మొదటి మీద ఒక ముద్దు పెట్టేది. ధైర్యంగా ఉండాలని చెప్పేది. “నువ్వు నా ఆరో ప్రాణం. నా శక్తి ఉన్నంతవరకు నిన్ను చూసుకుంటాను. నువ్వు ఎవరినీ అంతగా నమ్మకు. నిన్ను నువ్వు కాపాడుకో. నీకు నువ్వే ధైర్యం చెప్పుకో.. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆత్మస్థైర్యాన్ని దూరం చేసుకోవద్దని” తన తల్లి చెప్పేదని ఆ బాలిక వాపోయింది. ఆ బాలిక మాట్లాడిన మాటలు కంట నీరు తెప్పిస్తున్నాయి. ఇటు తండ్రికి తనకు తెలియకుండానే దూరం కావడం.. అటు తల్లిని కోల్పోవడంతో ఆ బాలిక అనాధగా మారిపోయింది. ఇప్పుడు ఆమె బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న ఎదురవుతోంది.
స్వేచ్ఛ పాత్రికేయురాలు మాత్రమే కాదు.. కవయిత్రి కూడా. ఆమె అనేక కవితలు రాసింది. స్వతహాగా ఒక పుస్తకాన్ని కూడా అచ్చు వేయించింది. రెండు సంవత్సరాల క్రితమే ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. తన మనసులో గూడు కట్టుకున్న భావాలకు ఆమె అక్షర రూపం కల్పించింది. తద్వారా ఆ పుస్తకం అందరి మన్ననలు పొందింది. ఎంతో ధైర్యంగా ఉండే స్వేచ్ఛ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సహచర పాత్రికేయులు జీర్ణించుకోలేకపోతున్నారు.