Journalist Swetcha death mystery: స్వేచ్ఛకు గతంలోనే వివాహం జరిగింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఒక కూతురు కలిగింది. ఆ తర్వాత విభేదాలతో అతడికి స్వేచ్ఛ విడాకులు ఇచ్చింది. గతంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో స్వేచ్ఛ పని చేసింది. అక్కడ ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో.. మరో ఛానల్ లోకి మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించింది. కేవలం పాత్రికేయురాలిగా మాత్రమే కాకుండా.. రచయిత్రియా కూడా స్వేచ్ఛ రాణించింది. మహిళా పాత్రికేయురాలిగా స్వేచ్ఛ ఉత్తమంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ మహిళా పాత్రికేయురాలి పురస్కారం అందించింది. ఇక ఒక పార్టీకి డప్పు కొట్టే ఛానల్లో ఆమె ప్రధాన స్థానంలో పని చేస్తోంది. అయితే ఇదే చానల్లో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమెకు పరిచయమైంది. ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ అతడు స్వేచ్ఛ వెంట పడ్డట్టు తెలుస్తోంది. అయితే అతడిని మొదట్లో స్వేచ్ఛ పట్టించుకునేది కాదు. ” నాకు నువ్వంటే ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అడ్డం ఉన్న నా భార్య అయితే.. ఆమెకు విడాకులు ఇస్తాను. నేను వివాహం చేసుకుంటాను” అని చెప్పడంతో స్వేచ్ఛ అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు.
విడాకులు ఇవ్వకపోవడంతో..
మొదట్లో చెప్పినట్టుగా ఆ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వకపోవడం.. పెళ్లి చేసుకోవాలని అడిగితే కాలయాపన చేయడంతో స్వేచ్ఛ నిలదీసింది. దీంతో పలు సందర్భాల్లో వారిద్దరు గొడవపడ్డారు. ఈ విషయం స్వేచ్ఛ తండ్రికి తెలుసు. ఇంత జరిగినప్పటికీ స్వేచ్ఛ తండ్రికి, ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తికి ముఖ పరిచయం లేకపోవడం విశేషం. పలు సందర్భాల్లో గొడవపడడం.. ఆ తర్వాత కలిసిపోవడం స్వేచ్ఛకు, ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తికి పరిపాటిగా మారిపోయింది. గొడవ జరిగినప్పుడు తన తండ్రికి చెప్పడం.. ఆ తర్వాత ఫోన్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూసుకోవడం.. అనంతరం స్వేచ్ఛ అతడితో కలిసిపోవడం వంటి పరిణామాలు అనేక సందర్భాలలో చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో స్వేచ్ఛ, ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తికి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. పెళ్లి విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్వేచ్ఛ ఈసారి కఠినంగా వ్యవహరించింది. తన తండ్రికి ఫోన్ చేసి.. తను, నేను విడిపోతున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా తాను డ్యూటీకి వెళ్తున్నట్టు చెప్పింది. కానీ ఇంతలోనే ఆమె దారుణానికి పాల్పడింది. ఇదే విషయాన్ని స్వేచ్ఛ తండ్రి కూడా వెల్లడించాడు. ” నా కూతురు మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను ప్రేమ పేరుతో ఆ వ్యక్తి వేధించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దానికి నా కూతురు ఒప్పుకుంది. అతడికి దగ్గర అయింది. అనేక సందర్భాల్లో పెళ్లి గురించి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసిపోయారు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. పైగా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్వేచ్ఛ నాకు చెప్పింది. ఆఫీస్ కి వెళ్తానని కూడా అన్నది. ఆ తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీనంతటి కారణం ఆ వ్యక్తే.. పోలీసులకు అన్ని వివరాలు చెబుతామని” స్వేచ్ఛ తండ్రి శంకర్ పేర్కొన్నాడు.