Maa Movie Collection: బాలీవుడ్ ఆడియన్స్ స్టార్ హీరోని చూసి గుడ్డిగా థియేటర్స్ కి వెళ్లిపోయే రోజులు పోయాయి. కేవలం వాళ్ళను ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటేనే థియేటర్స్ కి కదిలి వెళ్తున్నారు. లేకపోతే రెండున్నర గంటల సినిమాని చూసేందుకు సమయం వెచ్చించడం వృధా అనేది ఆడియన్స్ అభిప్రాయం. అందుకే ఈమధ్య కాలం నేటి తరం ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా సినిమాలు చేయడం లేదని సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలను చూడడం మానేశారు. కానీ రీసెంట్ గా విడుదలైన అమీర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) చిత్రానికి మంచి రేటింగ్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ఓపెనింగ్ పెద్దగా రాలేదు కానీ, ఆ తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ కారణంగా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా వసూళ్లకు నిన్న విడుదలైన కాజోల్ దేవగన్(Kajol Devgan) ‘మా'(Maa Movie) చిత్రం కాస్త గండి కొట్టింది.
Also Read: ఆ హీరోకు భార్యగా, ఫ్రెండ్ గా, తల్లిగా నటించిన టబు. ఇంతకీ ఎందుకిలా?
నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు కానీ, విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ బాగా క్లిక్ అవ్వడం తో సినిమా కి ఓపెనింగ్స్ అదిరాయి. ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రెండవ రోజు కూడా ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నుండే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 6 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ సినిమా వసూళ్లపై ఒక కాంట్రవర్సి కూడా నడుస్తుంది. ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో అత్యధిక కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయని, ‘మా’ చిత్రానికి కూడా అదే జరిగిందని అంటున్నారు.
అయితే సోషల్ మీడియా లో ఒక హీరో కి లేదా హీరోయిన్ కి ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కావాలని తమ అభిమాన హీరోయిన్ సినిమా బాగా ఆడుతుందని అక్కసు తో ఇలా నోటికొచ్చిన ప్రచారం చేస్తున్నారని కాజోల్ అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ రెండిట్లో ఏది నిజమో చూడాలి. అయితే బుక్ మై షో లో మాత్రం ఈ చిత్రం టీం సినిమాని ప్రొమోషన్స్ చేయిస్తుంది అనేది వాస్తవం. కానీ కార్పొరేట్ బుకింగ్స్ ఎంత వరకు నిజం అనేది చూడాలి. వీకెండ్ వరకు ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ గానే నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
#Maa [#MaaTheFilm] fares better than expected… Pre-release expectations and trade projections had pegged its Day 1 total at a modest ₹ 3.50 cr, but the actual figures have surpassed estimates.
Despite a limited release across 1500 screens in #India, #Maa held its own against… pic.twitter.com/L0QVEjo4kO
— taran adarsh (@taran_adarsh) June 28, 2025