Hindi language controversy : పనిలేని క్షురకుడు పిల్లి తల కొరిగాడట.. అలా ఉంది ఏపీలో రాజకీయ యవ్వారం.. అరే.. సంబంధం లేని విషయాలను లేవనెత్తి చర్చకు పెట్టి ట్రోల్స్ కొనితెచ్చుకొని తిట్లు తినడం ఏంటో కూటమి నేతలు ఒక్కసారి సోచాయించుకోవాలే.. ఎందుకంటే అది డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారా? నిజంగా ‘మీకు’ హిందీపై ప్రేమతో చేస్తున్నారో తెలియదు కానీ.. నిజంగానే బూమరాంగ్ అవుతోంది..
ఇప్పటికిప్పుడు మెడపైన కత్తి పెట్టి ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ లను ‘హిందీ’ని కీర్తించమని ఎవరూ బెదిరించడం లేదు. బీజేపీ కూడా ఇప్పుడు ఆ పని చేయడం లేదు. వారు దేశవ్యాప్తంగా అన్ని భాషలను గౌరవిస్తూ నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్ సహా అంతటా విస్తరిస్తున్నారు. చల్లగా రాజకీయం చేసుకుంటున్నారు. మరి ఈ కూటమి నేతలకు ఏమైందో కానీ.. ‘హిందీ’పై ఆపార ప్రేమ పుట్టుకొచ్చింది..
తేట తెలుగు.. తేనెలొలుకు అంటారు. అమ్మభాషను మించింది లేదు. అంతటి గూగుల్, చాట్ జీపీటీ లాంటి అత్యాధునిక ఏఐ వ్యవస్థలు కూడా తెలుగులోకి తీసుకొచ్చాయి మనకు చేరువ చేశాయి. స్థానిక భాషలకు విలువ, గౌరవం ఇస్తున్న రోజులు ఇవీ.. ఇప్పటికే హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఎన్నో జరిగాయి. హిందీని దేశమంతా రుద్దితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని నిరసనలు వ్యక్తమయ్యాయి. బీజేపీ కూడా హిందీని పట్టుకొని వేలాడకుండా చాలా లిబరల్ గా ముందుకెళుతున్నాయి.
అంతదాకా ఎందుకు మన ప్రధాని మోడీ గారి ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఏపీకి వస్తే తెలుగులో.. తమిళనాడుకు వస్తే తమిళంలో.. అస్సాంకు వెళితే అస్సామీలో ట్వీట్లు చేస్తాడు. మరో విశేషం ఏంటంటే.. మొన్న సైప్రస్ వెళ్లి గ్రీకులో.. అర్జెంటీనా, బ్రెజిల్ వెళ్లి వారి భాషలో ట్వీట్లు చేసి తాను సకల భాష గౌరవుడిని అని నిరూపించారు.
మోడీ లాంటి పెద్దమనిషినే భాషలను గౌరవిస్తూ నెత్తిన పెట్టుకుంటున్న రోజులివి. కానీ మన పెద్దలు ఏపీలోని కూటమి నేతలు మాత్రం ‘హిందీ’ హిందీ అంటూ పరితపిస్తున్నారు. దాని చుట్టు లొల్లి క్రియేట్ చేస్తున్నారు. ఈ వ్యర్థ వాదముల మధ్య కూటమి నేతలకు ప్లస్ కంటే మైనస్ నే ఎక్కువవుతోంది. అదో బూమరాంగ్ అవుతోంది.
భాషను పట్టుకొని బలవంతపు ప్రేమలు ఇప్పటికైనా కట్టిపెట్టండి. ఏమైనా ప్రజా ఉపయోగ పనులు చేయండి.. పథకాలు, హామీలపై దృష్టి పెట్టండి.. ‘పీవీ 17 భాషలు నేర్చుకున్నాడు.. మనం హిందీ నేర్చుకుంటే తప్పేంటి’ అని అంటే ఎవరూ ఏం చేయలేరు. అవసరం పడ్డవారు తప్పకుండా హిందీని నేర్చుకుంటారు. గౌరవిస్తారు. ఆ హిందీని బలవంతంగా రుద్దితేనే ఇదిగో ఇలా ట్రోల్స్ కు గురవుతుంటారు.. అయినా కూడు పెట్టని.. తన్నుకు చచ్చే ఈ విద్వేష ‘బాష’లు మనకెందుకు.. మనకు కావాల్సింది సుపరిపాలన.. సంక్షేమం.. వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్ అని విశ్లేషకుల అభిప్రాయం..
మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలని అడుగుతున్నారు.. కానీ పీవీ నరసింహ రావు 17 భాషలు నేర్చుకున్నాడు.. అందుకే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు pic.twitter.com/wB7L6txWtm
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2025